|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కల్పిక పబ్ గొడవ.. తప్పు ఎవరిదో తేల్చేసిన పోలీసులు

Published: 01-06-2025, 12:20 AM
కల్పిక పబ్ గొడవ.. తప్పు ఎవరిదో తేల్చేసిన పోలీసులు

టాలీవుడ్ నటి కల్పికపై ప్రిజం పబ్‌లో దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. పోలీసుల విచారణలో ఆమె తప్పు అని తేలింది. బర్త్‌డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో గొడవ పెట్టుకుంది.

Key Points

1

కల్పిక పబ్‌లో గొడవకు కారణం బర్త్‌డే కేక్.

2

కల్పిక తన సోషల్ మీడియాలో లైవ్ వీడియో పోస్ట్ చేసింది.

4

నెటిజన్లు కల్పికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కల్పిక పబ్‌లో గొడవ

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిజ‌మ్ పబ్‌లో టాలీవుడ్ న‌టి క‌ల్పిక‌పై దాడి ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. తప్పు కల్పికదే అని స్పష్టం చేశారు. సబ్‌స్క్రైబర్‌ల కోసమే కల్పిక పబ్‌లో హల్చల్ చేసిందని పోలీసులు వెల్లడించారు. బర్త్ డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో కల్పిక గొడవకు దిగినట్టు నిర్దారించారు. మరోవైపు కల్పిక తన సోషల్ మీడియాలో లైవ్ పెట్టి పబ్ నిర్వాహకులు తనతో దురుసుగా ప్రవర్తించారని వాపోయింది. అయితే వీడియోలోనూ కల్పిక పబ్ నిర్వాహకులతో రెచ్చగొట్టేలా మాట్లాడినట్టు కనిపించింది. తన పుట్టినరోజు అని కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వాలని కల్పిక నిర్వాహకులతో గొడవకు దిగినట్టు కనిపించింది. వీడియో చివరలో కూడా వీడియోను తాను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నానని, తనకు ఫాలోవర్లు కావాలని వాళ్ల కోసమే పోస్ట్ చేస్తున్నానని చెప్పింది. దీంతో పోలీసుల సమయాన్ని వృధా చేసిన న‌టిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. పాపులారిటీ కావాలంటే సినిమాల ద్వారా సంపాదించుకోవాలి కానీ ఇలాంటి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

పోలీసుల విచారణ

నెటిజన్ల ఆగ్రహం

చివరగా, పోలీసులు కల్పిక తప్పును నిర్ధారించారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.