
📌 Key Points
- రోషన్, శ్రీదేవి జంటగా వస్తున్న ‘బ్యాండ్ మేళం’ మూవీ గ్లింప్స్ విడుదల!
- వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో ఎమోషనల్ డైలాగ్స్!
- కోన వెంకట్ సమర్పణలో, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ‘బ్యాండ్ మేళం’ చిత్రం!
- మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ విడుదల.. కోర్ట్ జంట మరోసారి సందడి చేసేందుకు సిద్ధం!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ పెయిర్ రోషన్, శ్రీదేవి మరోసారి వెండితెరపై మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘బ్యాండ్ మేళం’ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ విడుదల!
Band Melam Glimpse: టాలీవుడ్ యంగ్ పెయిర్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమాను కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే సందర్బంగా బ్యాండ్ మేళం(Band Melam Glimpse) మూవీ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ హీరో తన ప్రేమ గురించి చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కోర్ట్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రోషన్, శ్రీదేవి జంటగా వస్తున్న ఈ సినిమా మార్చ్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
కోన వెంకట్ సమర్పణలో ‘బ్యాండ్ మేళం’!
మార్చి 13న థియేటర్లలో విడుదల!
బ్యాండ్ మేళం మూవీ గ్లింప్స్‌తోనే అంచనాలు పెరిగిపోయాయి. మార్చి 13న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


