|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బండి సంజయ్ సంచలన ప్రకటన: కొడుకు తప్పు చేస్తే శిక్ష తప్పదు, రాజకీయ కుట్రే!

Published: 12-05-2026, 5:01 PM
బండి సంజయ్ సంచలన ప్రకటన: కొడుకు తప్పు చేస్తే శిక్ష తప్పదు, రాజకీయ కుట్రే!
  • బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసుల వ్యవహారంపై మాట్లాడారు.
  • తప్పు రుజువైతే తన కొడుకుకు కూడా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.
  • రాజకీయ కక్షసాధింపులో భాగంగా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
  • న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, సత్యమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై నమోదైన కేసుల వ్యవహారంపై మరోసారి స్పందించారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. అయితే, ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

కుమారుడి కేసుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay Comments : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తాను చట్టాన్ని… న్యాయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.

కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన హిందూ ఎక్తా యాత్ర సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్….. నిజంగా తప్పు చేస్తే తన కొడుకును కూడా క్షమించనని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని… తప్పు రుజువైతే చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే అని వ్యాఖ్యానించారు. తన కుమారుడు మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడని…. చివరికి న్యాయస్థానమే నిజాన్ని నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ కక్షసాధింపులో భాగంగా తన కుటుంబాన్ని రోడ్డుకు లాగడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు . “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా కుమారుడిని లక్ష్యంగా చేసుకున్నారు. క్రిమినల్ లా చూపిస్తున్నారు. అతనిపై జరుగుతున్న దాడులను చూస్తుంటే వాళ్ల తల్లి తల్లడిల్లిపోతుంది… డ్రిపేషన్ లో కి వెళ్తోంది. ఇలా కుట్రలు పన్నడం దారుణం” అని బండి సంజయ్ మాట్లాడారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని… కోర్టు ఇచ్చే తీర్పును తాము శిరసావహిస్తామని సంజయ్ తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని…. కుట్రలు ఎన్ని చేసినా చివరికి సత్యమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కావాలనే ఇటువంటి వివాదాలను సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

చట్టం ముందు అందరూ సమానమే: సంజయ్

“రాజకీయాల్లో గెలవలేక నా కుటుంబాన్ని రోడ్డుకు లాగారు. నా పార్టీని, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఈ డ్రామాలు ఆడుతున్నారు” అని బండి సంజయ్ మండిపడ్డారు. రాజకీయ పోరాటాలు సిద్ధాంతాల మీద ఉండాలి కానీ, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు.

ఈ కుట్రల వెనుక ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. “నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారు ఒకటి గుర్తుంచుకోవాలి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నా మీద, నా కుటుంబం మీద కుట్రలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాం,” అని హెచ్చరించారు. సత్యం వైపే తాము ఉన్నామని, న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“కుట్రలు, కుతంత్రాలతో నా కుటుంబాన్ని బజారున పడేశారో వారిని విడిచిపెట్టను. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినట్లు మీరు పెట్టిన ఈ నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తాను. శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలేదు. నా గుండె మీద కాషాయం జెండా ఉంది. నా తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి చీప్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అయితే ఇలాంటి దాడుల వల్ల పార్టీ కార్యకర్తలు మరింత బలోపేతం అవుతారే తప్ప వెనక్కి తగ్గబోరని సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

రాజకీయ కక్షసాధింపుపై ఆవేదన

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‎కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2026, మే 13వ తేదీ మధ్యాహ్నం పేట్ బషీర్‎బాద్​ పోలీస్ స్టేషన్‎లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పై పెట్టిన పలు సెక్షన్లను పోలీసులు సవరించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం BNSS సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 సెక్షన్లుగా సవరించారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన కొడుకు విషయంలో చట్టానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే, రాజకీయ కుట్రలపై ఆయన చేసిన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.