|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టేజీపైనే తాటతీశాడు.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ హీరోనే..

Published: 04-11-2025, 12:05 AM
స్టేజీపైనే తాటతీశాడు.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ హీరోనే..

కిరణ్ అబ్బవరం ‘కె – ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరంను ప్రశంసిస్తూనే, పేరు చెప్పకుండా ఓ యువ హీరోపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

‘కె – ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

2

కిరణ్ అబ్బవరంను పొగుడుతూ, ఓ హిట్ తర్వాత అటిట్యూడ్ పెరిగే హీరోలపై పరోక్ష సెటైర్లు వేశారు.

4

బండ్ల గణేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, టార్గెట్ చేసిన హీరోపై చర్చకు దారితీశాయి.

బండ్ల గణేష్ ప్రశంసలు, సెటైర్ల వెనుక ఎవరు?

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె – ర్యాంప్’ దీపావళి విన్నర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది టీమ్. ఇందుకు గెస్ట్‌గా హాజరైన బండ్ల గణేష్.. హీరో కిరణ్ అబ్బవరంపై పొగడ్తలు కురిపిస్తూనే మరో హీరోపై సెటైర్లు వేశాడు. ఒక్క సినిమా హిట్ అయితే ఎస్‌ఎస్ రాజమౌళిని తీసుకురా.. సుకుమార్‌ను తీసుకురా.. అనిల్ రావిపూడిని తీసుకురా.. అనే ఈ రోజుల్లో.. కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకి కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేశాడని చెప్పాడు. ఒక్క హిట్ కొడితే.. లూజు ప్యాంట్లు.. కొత్త చెప్పులు.. క్యాప్.. అటిట్యూడ్‌ వచ్చేస్తున్నాయని.. అలా చేయకుండా వాస్తవికంగా ఉండాలని సూచించాడు. కిరణ్ అబ్బవరంను చూస్తే చిరంజీవి గుర్తొస్తున్నాడని.. కచ్చితంగా భవిష్యత్తులో బాగా ఎదుగుతాడని బ్లెస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బండ్ల గణేష్ టార్గెట్ చేసింది ఆ హీరోనే అంటూ కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నారు.

కిరణ్ అబ్బవరంపై గణేష్ వ్యాఖ్యలు

చిరంజీవితో పోలిక, భవిష్యత్తు అంచనాలు

బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆయన ఏ హీరోను టార్గెట్ చేశారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ కామెంట్లపై సదరు హీరో ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.