|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ ట్విస్ట్! బూతుల నుంచి పొగడ్తలకు.. త్రివిక్రమ్-బండ్లన్న మళ్లీ కలిశారు!

Published: 21-06-2026, 11:49 PM
షాకింగ్ ట్విస్ట్! బూతుల నుంచి పొగడ్తలకు.. త్రివిక్రమ్-బండ్లన్న మళ్లీ కలిశారు!
  • బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన కలయిక, నెట్టింట వైరల్.
  • గతంలో త్రివిక్రమ్ పై బూతుల వర్షం కురిపించిన బండ్లన్న.
  • ‘గురూజీ’ అంటూ త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ ప్రశంసలు.
  • పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వివాదం మళ్లీ తెరపైకి.

టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు! ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బండ్లన్న మళ్లీ కలిసిపోయారు. ఈ ఊహించని పరిణామం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది!

బూతుల నుంచి పొగడ్తలకు మారిన బండ్లన్న!

బండ్ల గణేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగా సినిమాల్లో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే స్థాయి నుంచి.. టాలీవుడ్ స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించే నిర్మాత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. తన వ్యవహార శైలితో, స్పీచ్ లతో వార్తల్లో ఉంటుంటారు. ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడుతారో, ఎందుకు పొగుడుతారో, ఎందుకు విమర్శిస్తారో ఎవరూ ఊహించలేరు. ఒకసారి పొగిడిన వ్యక్తిపైనే మరో సందర్భంలో విమర్శలు గుప్పిస్తారు. విమర్శించిన వ్యక్తినే మళ్లీ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ‘మా’ ఎన్నికల సమయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన బండ్ల గణేష్.. రీసెంట్ గా ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఒకప్పుడు దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ ను తీవ్ర పదజాలంతో దూషించిన బండ్లన్న.. ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఆయన మీద ప్రేమాభిమానాలు ఉన్నట్లు చాటుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. త్రివిక్రమ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. “థాంక్యూ గురూజీ.. మీ ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, చల్లగా ఉండాలని, ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తూ, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి థాంక్యూ గురూజీ. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” బండ్లన్న ఎక్స్ లో రాసుకొచ్చారు. త్రివిక్రమ్ ను ఇప్పుడెందుకు కలిసారో తెలియదు కానీ.. ఆయన్ని ఉద్దేశించి బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తన దేవుడు పవన్ కళ్యాణ్ కు తనను దూరం చేస్తోంది త్రివిక్రమ్ అన్నట్టుగా బండ్లన్న ఓ సందర్భంలో ఆరోపణలు చేశారు. ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ కి తనని ఆహ్వానించకపోవడం గురించి పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల ఫోన్లో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ ను బూతు పదాలతో విమర్శించారు. ఆ ఆడియో లీక్ అవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. పవన్ కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బండ్ల గణేష్ మాత్రం ఆ ఆడియో తనది కాదని అంటూ మాట మార్చకుండా.. మరో సందర్భంలో త్రివిక్రమ్ కు క్షమాపణలు చెప్పారు. కానీ దర్శకుడితో పెద్దగా సన్నిహితంగా మెలిగింది లేదు. ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు కూడా ఎక్కడా లేవు. అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ ను కలవడమే కాదు.. ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు విమర్శించిన నోటితోనే ప్రశంసించడం, గురూజీ అని సంబోధించడంపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో బండ్ల గణేష్ మళ్లీ మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారనే సంగతి తెలిసిందే. చిరంజీవి ‘మెగా 158’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ – గణేష్ చాలా సన్నిహితంగా కనిపించారు. ఒకరినొకరు హగ్ చేసుకొని నవ్వుతూ ఫోటోలు దిగారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కు తనను దూరం చేస్తున్నారని ఆరోపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా బండ్ల గణేష్ దగ్గరయ్యారు. రాజకీయాల్లో మాదిరే సినీ రంగంలోనూ శాశ్వత శత్రువులు ఉండరు అంటుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ ప్రేమాభిమానాలు కురిపించడం చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.

త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ సడెన్ రీ-యూనియన్!

పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చర్చ మొదలు!

బండ్లన్న, త్రివిక్రమ్ కలయిక వెనుక అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఈ సంచలన పరిణామంపై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.