
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన రీఎంట్రీని ప్రకటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘తెలుసుకదా’ సక్సెస్ మీట్ లో ఆయన మళ్ళీ సినిమా నిర్మాణం మొదలుపెడతానని తెలిపారు. గబ్బర్ సింగ్, టెంపర్ వంటి హిట్స్ తర్వాత తిరిగి వస్తున్న ఆయన, ఏ హీరోతో సినిమా చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Key Points
బండ్ల గణేష్ నిర్మాతగా తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
సిద్దు జొన్నలగడ్డ సినిమా సక్సెస్ మీట్‌లో ఈ ప్రకటన చేశారు.
గబ్బర్ సింగ్, టెంపర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు.
ఏ హీరోతో సినిమా చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
రీఎంట్రీపై బండ్ల గణేష్ ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన రీఎంట్రీని ప్రకటించాడు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసుకదా సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాత ఎస్కేఎన్ తనను రీఎంట్రీ ఇవ్వాలని అడిగాడని చెప్పారు. తాను టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సినిమాలకు బ్రేక్ ఇచ్చానని, ఫ్లాప్ సినిమాతో బ్రేక్ తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమా మొదలవుతుందని స్పష్టం చేశారు. దీంతో నిర్మాతగా తన రీఎంట్రీని కన్ఫామ్ చేశారు.
ఇదిలా ఉంటే బండ్ల గణేష్ మొదట నటుడిగా సినిమాల్లో మెప్పించగా తరవాత రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో టాలీవుడ్‌కు ప్రొడ్యూసర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరవాత వరుస సినిమాలు చేసినా గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. గబ్బర్ సింగ్ తరవాతే బండ్లకు నిర్మాతగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక చివరగా ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తరవాత ఏం జరిగిందో కానీ సినిమాకు దూరం అయ్యారు. ఇప్పుడు రీఎంట్రీ ప్రకటించడంతో ఏ హీరోతో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిర్మాతగా బండ్ల గణేష్ ప్రస్థానం
తదుపరి సినిమాపై అంచనాలు
బండ్ల గణేష్ రీఎంట్రీ ప్రకటన టాలీవుడ్‌లో ఉత్సాహాన్ని నింపింది. గబ్బర్ సింగ్, టెంపర్ వంటి విజయాల తర్వాత తిరిగి వస్తున్న ఆయన, ఏ హీరోతో, ఎలాంటి కథతో సినిమా చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ కొత్త ప్రస్థానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.



Amitabh Bachchan Admits Mistake After Racism Row Over France Football Team Tweet