
📌 Key Points
- మెగా 158లో బండ్ల గణేష్‌కు అదిరిపోయే పాత్ర!
- చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు
- బండ్ల గణేష్ కోసం ప్రత్యేకంగా 10 సన్నివేశాలు డిజైన్ చేసిన మేకర్స్!
- గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబో!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158 సినిమాలో బండ్ల గణేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా 158లో బండ్ల గణేష్‌కు ఛాన్స్!
బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాల పాటు అలాగే కెరీర్ను కొనసాగించిన ఈయన ఆ తర్వాత ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. నిర్మాతగా చాలా సినిమాలను నిర్మించారు. ఆ సమయంలో నటనవైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. గణేష్ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం సినిమాల్లో నటించడం లేదు, అలాగే నిర్మించడం కూడా లేదు. తాజాగా ఈయనకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలో మంచి అవకాశం వచ్చినట్లు, ఆయనపై ఏకంగా అనేక అద్భుతమైన సన్నివేశాలు కూడా మేకర్స్ డిజైన్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
చిరంజీవి, బాబీ కాంబో మళ్ళీ వచ్చేస్తుంది!
ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? అదే మెగా 158. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బండ్ల గణేష్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు, ఈ సినిమాలో ఆయనకు ఏకంగా 10 సన్నివేశాలు ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
బండ్ల గణేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింటేనా?
చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ ఓ స్టార్ హీరో సినిమాలో భాగం కానున్నట్లు వార్తలు వస్తుండడం, అందులో ఆయనకు మంచి ప్రాముఖ్యత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఈ సినిమా గనుక మంచి ప్రేక్షకాదరణ పొందినట్లయితే ‘బండ్ల గణేష్’కి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. దానితో వీరిద్దరి కాంబోలో రాబోయే రెండవ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ మళ్ళీ నటిస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఒక మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


