
📌 Key Points
- బంగ్లాదేశ్‌లో హిందువులపై బాంబు దాడి, పూజారికి తీవ్ర గాయాలు.
- కొమిల్లాలో పూజ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల దాడి.
- దేశంలో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో హిందువులపై దాడులు.
- నిందితులను పట్టుకునేందుకు పోలీసుల గాలింపు చర్యలు ప్రారంభం.
బంగ్లాదేశ్‌లో హిందువులపై మరోసారి దాడులు జరిగాయి. కొమిల్లా ప్రాంతంలో పూజ చేస్తున్న వారిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో పూజారి కేశవ్ చక్రవర్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొమిల్లాలో హిందువులపై బాంబు దాడి
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు మరోసారి కలకలం రేపుతోంది. శనివారం నాడు కొమిల్లా ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిందువుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రక్తసిక్తమైంది. ఇందుకు సంబందించిన సీసీఫుటేజీ వీడియో వైరల్ అవుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కొమిల్లాలో హిందువులు సామూహికంగా పూజలు నిర్వహిస్తుండగా, గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా బాంబులు విసిరారు. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పూజారి కేశవ్ చక్రవర్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పూజారి తో పాటు మరికొందరు భక్తులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అల్లర్ల సాకుతో హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ హింసాకాండలో ఇప్పటికే పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. కాగా, తాజాగా జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనకు గల కారణం ఇంకా తెలియలేదు.
తీవ్రంగా గాయపడిన పూజారి కేశవ్ చక్రవర్తి
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేకూరాలని పలువురు కోరుతున్నారు.


