
📌 Key Points
- చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ఫిబ్రవరి 6న విడుదల!
- ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజిపై లిప్ కిస్ పోజులతో హీటెక్కించిన హీరో హీరోయిన్!
- సినిమా పోస్టర్‌లో లిప్ కిస్ ఉండటంతో రీక్రియేట్ చేసిన జంట!
- ప్రమోషన్స్‌లో హద్దులు దాటుతున్నారని నెటిజన్ల కామెంట్స్, వైరల్ అవుతున్న ఫోటోలు!
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా వస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
స్టేజిపై లిప్ కిస్ పోజులు!
Barabar Premistha : ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా జనాల్లోకి వెళ్లాలని మూవీ యూనిట్స్ చిత్ర విచిత్రాల ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో కొన్ని ఇబ్బందికరంగా ఉండే ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ హీరో హీరోయిన్స్ చేసిన ప్రమోషన్ కాస్తా వైరల్ గా మారింది.(Barabar Premistha)
సీనియర్ నటుడు ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ యాటిట్యూడ్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమాతో ఫిబ్రవరి 6న రాబోతున్నారు. మూవీ యూనిట్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
వైరల్ అవుతున్న ఫోటోలు!
అయితే తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో స్టేజిపైనే హీరో హీరోయిన్ ఆల్మోస్ట్ లిప్ కిస్ పెట్టుకున్నట్టు ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ లో హీరో హీరోయిన్ లిప్ కిస్ ఇచ్చుకోడానికి సిద్ధమవుతున్నట్టు ఉంటారు. సినిమాలో వీరి మధ్య లిప్ కిస్ సీన్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పోస్టర్ రీ క్రియేషన్ చేయాలన్నట్టు స్టేజిపైనే హీరో హీరోయిన్స్ మోకాళ్ళ మీద కూర్చొని మరీ లిప్ కిస్ ఇచ్చుకునేలా పోజులు ఇచ్చారు.
నెటిజన్ల కామెంట్స్!
దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మరీ ఇంతలా ప్రమోషన్ చేస్తారా? ఇంకొంచెం అయితే స్టేజిపై లిప్ కిస్ కూడా పెట్టేలా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రమోషన్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా విడుదల తరువాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


