
📌 Key Points
- చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విడుదల.
- మొదటి రోజు కలెక్షన్లు రూ. 31 లక్షలు, వారం మొత్తం కలెక్షన్లు రూ. 93 లక్షలు.
- సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
- రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, నిర్మాతలకు 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ కలెక్షన్ల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి ఫలితం సాధించిందో తెలుసుకోండి.
బరాబర్ ప్రేమిస్తా మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన మూవీ `బరాబర్ ప్రేమిస్తా`. అనేక వివాదాల మధ్య ఈ మూవీ గత శుక్రవారం విడుదలైంది. ఇందులో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా, మురళీధర్ గౌడ్, అభయ్ నవీన్, లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఆద్యంతం లవ్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీలో కులానికి సంబంధించి అందించిన సందేశం బాగుంది.
గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. మూవీ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కానీ కులానికి సంబంధించి అందించిన సామాజిక సందేశం బాగుంది. కానీ వివాదం సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఆడియెన్స్ కి చేరువ కాలేదు. ఈ వివాదం వల్ల సినిమాకి వెళ్లాలనుకున్న వాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి. ఇటీవల కాలంలో సినిమా జనంలోకి వెళ్లడానికి వివాదం చేస్తుంటారు. దాని వల్ల బాగా ప్రమోషన్ జరుగుతుందని భావిస్తుంటారు. కానీ `బరాబర్ ప్రేమిస్తా` మూవీకి మాత్రం రివర్స్ అయ్యింది. చాలా ప్రభావం పడింది. దీంతో మూవీని పట్టించుకునే వాళ్లే లేరు.
నెగటివ్ టాక్ తోనూ భారీ వసూళ్లు
ఇక సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈచిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి? బ్రేక్ ఈవెన్ అయ్యిందా? నిర్మాతలు సేఫా? నష్టపోయారా? అనేది చూస్తే, ఈ మూవీ మొదటి రోజు రూ.31లక్షలు వసూలు చేసింది. రెండో రోజు రూ.22లక్షలు వచ్చింది. మూడో రోజు రూ.14 లక్షలు రాబట్టింది. వీకెండ్‌లో ఈ మూవీకి దాదాపు రూ.67లక్షలు రాబట్టింది. ఇక వీక్ డేస్‌లో దారుణంగా పడిపోయింది. సోమవారం రూ.10లక్షలు, మంగళవారం రూ.7లక్షలు, బుధవారం ఐదు లక్షలు, గురువారం రూ.4లక్షలు వచ్చాయి.
నిర్మాతలకు భారీ నష్టాలు!
మొత్తంగా వారం రోజుల్లో ఈ మూవీ రూ.79లక్షల నెట్, రూ.93లక్షల గ్రాస్ రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చిన ఈ రేంజ్‌లో వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. పైగా కొత్తగా వస్తోన్న హీరోకిది మంచి వసూళ్లనే చెప్పొచ్చు. అదే సినిమాని పాజిటివ్ వైపు ప్రమోట్ చేసి ఉంటే ఈజీగా రెండు కోట్ల వరకు రాబట్టేది. అది నిర్మాతలకు హెల్ప్ అయ్యింది. కానీ నెగటివ్ ప్రచారం సినిమాని చంపేశాయి. ఇక ఈ మూవీని సుమారు రూ.4కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఓటీటీ, శాటిలైట్ రూపంలో కొంత వస్తుంది. ఇవన్నీ రానూ, నిర్మాతలకు రెండు కోట్లకుపైగానే నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మూవీ ఈ శుక్రవారంతో క్లోజ్ అనే చెప్పొచ్చు. కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఆల్మోస్ట్ అన్ని థియేటర్ల నుంచి ఎత్తేశారని టాక్.
బరాబర్ ప్రేమిస్తా మూవీ కలెక్షన్ల వివరాలు చూశారు కదా! మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.


