
📌 Key Points
- బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు కేటాయింపు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
- వేద వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన ఆలయం
- ఆలయ పునరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన
ప్రఖ్యాత బాసర సరస్వతీ దేవి ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం మహర్దశ కల్పించనుంది. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు.
బాసర ఆలయానికి మహర్దశ
దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత సరస్వతీ దేవి ఆలయానికి బాసర ఎంతో ప్రసిద్ధి. అక్షరాభయాసానికి ప్రసిద్ధ కేంద్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్ధశ రానుంది. ఈ ఆలయాన్ని పునరాభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 225 కోట్లతో పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేస్తారు.
రూ.225 కోట్లతో అభివృద్ధి పనులు
వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనస్సులను ఆకట్టకోనుంది. వేల ఏళ్ల ఘన చరిత్ర గల్గిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. పునరాభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్‌లో ఆలయ రీడెవలప్‌మెంట్ నమూనా ఫొటోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుండటం హర్షణీయం. ఆలయ పునఃనిర్మాణంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


