
తెలంగాణలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ 2025లో ఎప్పుడు? ఈ పండుగలోని తొమ్మిది రోజుల వివరాలు, ప్రతి రోజు చేయాల్సిన పూజలు, నైవేద్యాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Key Points
2025 బతుకమ్మ పండుగ తేదీలు మరియు వివరాలు
ప్రతి రోజు జరిగే పూజా విధానాలు మరియు నైవేద్యాలు
వివిధ రకాల బతుకమ్మలు మరియు వాటి ప్రాముఖ్యత
బతుకమ్మ పండుగ సంప్రదాయాలు మరియు ఆచారాలు
బతుకమ్మ పండుగ తేదీలు
బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఇది. ఈ పండుగను తొమ్మిది రోజులు పాటు అత్యంత ఘనంగా జరుపుతారు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తోంది? తేదీలతో పాటు ఏ రోజు ఏ బతుకమ్మను ఆరాధించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య నుంచి మొదలు
ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య నుంచి మొదలవుతుంది. తొమ్మిది రోజులు పాటు ఘనంగా ఈ పండుగను జరుపుతారు. ఏ రోజున, ఏ రూపంలో బతుకమ్మను ఆరాధించాలి? ఈ పండుగ విశిష్టత ఏమిటి? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య నుంచి పండుగ మొదలవుతుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకోవాలి. ఎంగిలిపూల బతుకమ్మ అంటే బతుకమ్మను తయారు చేయడానికి వాడే పూలను ముందు రోజు తెచ్చుకొని వాడిపోకుండా నీళ్లు వేసి, తర్వాత రోజు బతుకమ్మను పేరుస్తారు.
అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది. మొదటి రోజు పూర్వీకులకు అన్నదానం చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజు వాయినంగా తమలపాకులు, తులసి ఆకులను ఇస్తారు. బియ్యం, నువ్వులు, బియ్యం పిండిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
ప్రతిరోజూ చేయాల్సిన పూజ
రెండవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుతారు. పూలన్నీ తెచ్చి బతుకమ్మను పేర్చుతారు. అటుకుల బతుకమ్మ పండుగ నాడు బెల్లం, అటుకులను నైవేద్యంగా పెడతారు.
మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు ముద్దపప్పు, పాలు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. మూడంతరాల్లో వివిధ రకాల పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత మహిళలు ఆడుకుని చెరువులో బతుకమ్మను వేసి వచ్చేస్తారు.
4.నానబెట్టిన బియ్యం బతుకమ్మ:
నాలుగవ రోజున నానబెట్టిన బియ్యం బతుకమ్మను జరుపుతారు. తంగేడు పూలు, గునుగు పూలతో నాలుగంతరాల్లో బతుకమ్మను పేర్చి అలంకరిస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు.
ఐదవ రోజున అట్ల బతుకమ్మను జరుపుతారు. తంగేడు పూలు, చామంతి పూలు, గునుగు పూలు, మందారం పూలు, గుమ్మడి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఆ రోజు గోధుమ అట్లు లేదా దోసెలను నైవేద్యంగా పెడతారు.
ప్రత్యేకమైన నైవేద్యాలు
ఆరవ రోజున అలిగిన బతుకమ్మను జరుపుతారు. ఈరోజు గౌరీ దేవి బాధపడ్డారని అంటారు. అమ్మవారు అలిగి ఏమి తినరట. అందుకే నైవేద్యం పెట్టరు.
ఏడవ రోజున వేపకాయల బతుకమ్మను జరుపుతారు. తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గులాబీ పూలతో ఏడంతరాలుగా పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. ఆ తర్వాత మహిళలు బతుకమ్మ ఆడి, చెరువులో బతుకమ్మను వదిలేస్తారు. బియ్యం పిండిని వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
ఎనిమిదవ రోజున వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. గునుగు పూలు , తంగేడు పూలు, చామంతి పూలు, గులాబీ పూలతో బతుకమ్మను పేర్చి అలంకరిస్తారు.
ఆఖరి రోజున సద్దుల బతుకమ్మను జరుపుతారు. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న గౌరమ్మను కూడా తయారు చేస్తారు. ఆఖరి రోజున ఆడవారందరూ చీకటి పడేదాకా బతుకమ్మ ఆడుతారు. ఐదు రకాల నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, పెరుగు అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటివి తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఈ పండుగలో భాగంగా అమ్మవారిని ఆరాధించి, సుఖ శాంతుల కోసం ప్రార్థిద్దాం.


