|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బీసీసీఐలో రంగు రాజకీయం! కామెంట్రీకి మాజీ క్రికెటర్ గుడ్‌బై వెనుక అసలు నిజాలివేనా?

Published: 20-03-2026, 9:35 AM
బీసీసీఐలో రంగు రాజకీయం! కామెంట్రీకి మాజీ క్రికెటర్ గుడ్‌బై వెనుక అసలు నిజాలివేనా?
  • బీసీసీఐలో వర్ణ వివక్ష ఉందని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆరోపించారు.
  • కామెంటరీ ప్యానెల్‌లో తనను కావాలనే విస్మరించారని ఆయన అన్నారు.
  • దక్షిణ భారత ఆటగాళ్ల పట్ల వివక్ష చూపుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
  • గతంలో శివరామకృష్ణన్ చేసిన విమర్శల కారణంగానే అవకాశాలు రాలేదని మరికొందరు అంటున్నారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో వర్ణ వివక్ష ఉందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తన రంగు కారణంగానే కామెంటరీ అవకాశాలు కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శివరామకృష్ణన్ సంచలన ఆరోపణలు

భారత క్రికెట్ నియంత్రణ మండలిలో (BCCI) వర్ణ వివక్ష కలకలం రేపుతోంది. తాజాగా బీసీసీఐపై టీమిండియా మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. తాను క్రికెట్ వ్యాఖ్యానానికి (Commentary) స్వస్తి పలకడానికి బీసీసీఐ తన పట్ల వర్ణ వివక్ష చూపిందని భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ (Laxman Sivaramakrishnan) సంచలన ఆరోపణలు ఆరోపించారు. భారత్ తరపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడి.. 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషింషించిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత సుమారు రెండు దశాబ్దాల పాటు తన కామెంటరీతో అభిమానులను అలరించారు. అయితేచాలా కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ ప్యానెల్‌లో ఆయన కనిపించడం లేదు.

నెటిజన్ల స్పందన

ఇదే విషయాన్ని తాజాగా ఒక నెటిజన్ అడుగగా అందుకు శివరామకృష్ణన్ స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కామెంటరీ చేయడం మానేశాను. దానికి కారణం వివక్ష అని స్పష్టం చేశారు. నా రంగును బట్టి నన్ను పక్కన పెట్టారు. 20 ఏళ్ల పాటు నేను ప్రపంచవ్యాప్తంగా కామెంటరీ చేశాను. కానీ నా స్వదేశంలోనే నాకు గౌరవం దక్కలేదని ఆరోపించారు. అంతే కాదు భారతదేశంలో కామెంటేటర్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేదని కేవలం రంగు లేదా ఇతర అంశాల ఆధారంగానే అవకాశాలు ఇస్తున్నారని ఆరోపించారు. తాను ఎంతో అనుభవం ఉన్న సీనియర్ కామెంటేటర్ అయినప్పటికీ గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐ తనను కావాలనే విస్మరించిందని ఆయన వాపోయారు.

విమర్శలు, ప్రతి విమర్శలు

శివరామకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కొందరు కామెంట్స్ చేస్తుంటే వ్యతిరేకంగా మరికొందరు స్పందిస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నవారిలో కొందరు కామెంట్స్ చేసతూ దక్షిణ భారత ఆటగాళ్ల పట్ల, ముదురు రంగు ఉన్న వారి పట్ల వివక్ష చూపడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది స్పందిస్తూ.. శివరామకృష్ణన్ గతంలో సునీల్ గవాస్కర్ వంటి సీనియర్లపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూన్నారు. రంగు వల్ల కాదు ఆయన ప్రవర్తన వల్లే ఆయనకు అవకాశాలు దూరమయ్యాయని అభిప్రాయపడుతున్నారు.

లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆరోపణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ వివాదం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.