
📌 Key Points
- ఒకప్పటి స్టార్ హీరో ఏఎన్నార్‌ను విమర్శించిన ఓ బిచ్చగాడు!
- సినిమా గురించి బిచ్చగాడు చేసిన కామెంట్లకు కూల్ గా రియాక్ట్ అయిన అక్కినేని.
- రైలు ప్రయాణంలో అక్కినేనితో ముచ్చటించిన బిచ్చగాడు.. సినిమాపై షాకింగ్ కామెంట్స్!
- బిచ్చగాడి విమర్శకు ఏఎన్నార్ సమాధానం: ‘నాకు కూడా అదే అనిపించింది!’
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త! అక్కినేని నాగేశ్వరరావు గారిని ఓ బిచ్చగాడు విమర్శించాడంటే నమ్మగలరా? అసలు ఆ బిచ్చగాడు ఏమన్నాడు? ఏఎన్నార్ ఎలా రియాక్ట్ అయ్యారు? తెలుసుకుందాం!
బిచ్చగాడి ప్రశ్నతో షాక్ అయిన ఏఎన్నార్!
ఒకప్పుడు ఎంత పెద్ద హీరో అయినా.. విమర్శ సరైనదైతే కూల్ గా తీసుకునేవారు. ”స్వీయ లోపంబులెరుగుట గొప్ప విద్య” అని.. ఆనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరావు చాలా సందర్బాల్లో వెల్లడించాడు. తనలో లోపాలు తెలుసుకోగలిగి… అవి మార్చుకుంటే.. ఏ రంగంలో అయినా ఎదుగుతారని అక్కినేని నమ్మేవారు.
అందుకే తన హీరోగా ఎలాంటి సబ్జెక్ట్స్ చేయగలడో.. అవే ఎంచుకున్నాడు. సినిమాల విషయంలో ఎన్టీఆర్ తో పోటీ ఉన్నా.. పాత్రల విషయంలో మాత్రం అక్కినేని జాగ్రత్తగా ఉండేవారు. ఎన్టీఆర్ చేసే పౌరాణిక పాత్రల జోలికి అక్కినేని వెళ్లేవారు కాదు. ఆ పాత్రలకు తను సరిపోనని ఆయన నమ్మేవారు.
అందుకే తాను చేయగలిగినవి మాత్రమే ఎంచుకుని సినిమాలు చేసి.. సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. అక్కినేని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరీ ముఖ్యంగా విమర్శలను సానుకూలంగా తీసుకుంటారు. సినిమా చూసి ఎవరు ఏం చెప్పినా వాటి గురించి ఆలోచిస్తారు. చివరకు ఓ సినిమా విషయంలో బిచ్చగాడి తో విమర్శలు ఫేస్ చేశారట ఏఎన్నారు.
ఆ సినిమాలో నటించడం నాకు ఇష్టం లేదు: అక్కినేని
ఈ విషయాన్ని అక్కినేని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ సారి తిరుపతిలో ఓ కార్యక్రమానికి వెళ్లి.. హైదరాబాద్ కు తిరుగు ప్రాయణం అయ్యారు ఏఎన్నార్. ఆ సమయంలో రైలు ప్రయాణంలో ఓ బిచ్చగాడితో నాగేశ్వరావు ముచ్చటించారట. ఆ బిచ్చగాడు అక్కినేని దగ్గరకు వచ్చి డబ్బులడిగాడు. అప్పుడు ఆయన కొంత దర్మం చేసి.. బిచ్చగాడితో సరదాగా కొన్ని మాటలు మాట్లాడారు.
ఏం చేస్తుంటావు..? ఎంత సంపాదిస్తావు? ఎక్కడుంటావు.. ఇలా చాలా విషయాలు అక్కినేని అతడిని అడిగాడు. అతను కూడా అంత పెద్ద స్టార్ హీరో మాట కలిపేసరికి.. సంతోషంగా.. తన వివరాలు వెల్లడించారు. ఇక అంతా అయిపోయిన తరువాత ఏఎన్నార్ తో అతను ఓ మాట అన్నాడు.
ఓ సినిమా గురించి. బిచ్చగాడు మాట్లాడుతూ.. ” సర్ నేను అంటున్నాను అని ఏం అనుకోకండి..అప్పుడు ఓ సినిమా చేశారు కదా.. అసలు అదేందకు చేశారు. నేను మీ అభిమానిని.. అయినా ఓ విషయం చెపుతున్నా.. అక్కినేని ఏంటి? ఈ సినిమా చేయడం ఏంటి అనిపించింది. అసులు ఎందుకు ఇలాంటి సినిమా చేశారా అని అందరికి అనిపించింది. అన్నీ తెలిసి అలాంటి సినిమా ఎందుకు చేశారు. ” అని ముఖం మీదనే క్లాస్ పీకాడు.
విమర్శలను స్వీకరించే అక్కినేని గొప్ప మనసు!
దానికి ఏఎన్నార సమాధానం చెపుతూ.. ” నీకే కాదు నాకు కూడా అదే అనిపించింది. నాకు నచ్చి ఆ సినిమా చేయలేదు.. అలా చేయాల్సి వచ్చింది. ఆతరువాత నేను కూడా ఆ విషయంలో రియలైజ్ అయ్యాను అని చాలా రెస్పాన్స్ బుల్ గా బిచ్చగాడికి సమాధానం చెప్పారు.
అతను అలా అనడంతో తప్పులేదు.. నేను ఆ సినిమా చేయడం నా అభిమానులకు కూడా నచ్చలేదు” అని ఏఎన్నార్ అన్నారు. అయితే ఆయనఆ సినిమా పేరేంటో మాత్రం చెప్పలేదు. గతంలో అక్కినేని చెప్పిన మాటలు.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఏఎన్నార్ గారి గురించి ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


