
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బెంజ్’ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఎల్‌సీయూతో ఎలా అనుసంధానం అవుతుందో తెలుసుకుందాం.
Key Points
లారెన్స్ హీరోగా నటిస్తున్న 'బెంజ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!
సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు, మడోన్నా సెబాస్టియన్ పరిశీలనలో!
లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లో 'బెంజ్' చిత్రం కూడా భాగం!
నివీన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు, ఆయన పాత్రను పరిచయం చేసే వీడియో విడుదలైంది!
బెంజ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు?
సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్‌సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే ‘బెంజ్’. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.
సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ ‘బెంజ్’లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్‌ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.
లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌తో సంబంధం?
సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్‌గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్‌గా ‘బెంజ్’ విలన్‌కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్‌లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.
నివీన్ పౌలీ విలన్ పాత్ర
లోకేశ్ ప్రస్తుతం ‘కూలీ’ తీస్తున్నాడు. దీని తర్వాత ‘ఖైదీ 2’ ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?
చివరగా, ‘బెంజ్’ సినిమా ఎల్‌సీయూతో ఎలా అనుసంధానం అవుతుందో తెలియాల్సి ఉంది. మూడు హీరోయిన్లతో ఈ సినిమా ఎలాంటి కథను ప్రేక్షకుల ముందుంచుతుందో చూడాలి.


