
‘బిచ్చగాడు’ సినిమాలతో పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తన తాజా చిత్రం ‘భద్రకాళి’ గురించి వివరించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలోని తన పాత్ర గురించి, సినిమా ప్రత్యేకతల గురించి మాట్లాడారు.
Key Points
విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' సినిమా సెప్టెంబర్ 19న విడుదలవుతోంది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పొలిటికల్ బ్రోకర్‌గా నటిస్తున్నారు.
ఇప్పటివరకు చూడని విధమైన రాజకీయ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు.
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించబడిన ఈ చిత్రం స్టోరీ, స్కేల్ పరంగా బిగ్గెస్ట్ మూవీ అని విజయ్ ఆంటోనీ అభిప్రాయం.
‘భద్రకాళి’ విడుదల తేదీ
బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ‘ మార్గన్ ‘ విజయం తర్వాత మరో పవర్‌ఫుల్ మూవీతో రానున్నాడు. అదే ‘భద్రకాళి’ మూవీ. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.
భద్రకాళి సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన భద్రకాళి మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
‘ భద్రకాళి ‘ మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భద్రకాళి మూవీ విశేషాలను హీరో విజయ్ ఆంటోనీ విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
విజయ్ ఆంటోనీ పాత్ర విశేషాలు
-భద్రకాళి పొలిటికల్ థ్రిల్లర్ . కరెంట్ పాలిటిక్స్ ఇందులో కోర్ ఎలిమెంట్. నేను పొలిటికల్ మీడియేటర్‌గా కనిపిస్తాను. సాధారణంగా రాజకీయాల్ని మనం సినిమాల్లో చాలా డ్రమెటిక్‌గా చూస్తాం. కానీ, ఈ సినిమాలో పాలిటిక్స్ చాలా నేచురల్‌గా చూపించడం జరిగింది.
-రాజకీయాల్లో ఒక మీడియేటర్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక పెద్ద పెద్ద స్కామ్‌లో తన పాత్ర ఏమిటి? అనేది ఆడియన్స్‌కి న్యూ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఈ పాలిటిక్స్ ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకునేలా ఉంటుంది.
-డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు అద్భుతమైన కథ తీసుకొచ్చారు. ఆయన ఇంతకుముందు రెండు సినిమాలు చేశారు. అందులో అరవి సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో నా 25వ సినిమా రావడం ఆనందంగా ఉంది ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో బిగ్గెస్ట్ మూవీ ఇది.
సినిమా ప్రత్యేకతలు
-నా ప్రతి సినిమాకి ఒకే లాగా కష్టపడతాను. ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్. అయితే, భద్రకాళి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీసిన సినిమా. ఇది స్టోరీ, స్కేల్ పరంగా బిగ్గర్ మూవీ.
-పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ క్యారెక్టర్ ఇప్పటివరకు రాలేదు. ఈ ప్రతి ఎలిమెంట్ చాలా రియల్‌గా కనిపిస్తుంది. మేకప్ లేకుండా నటించడం జరిగింది. మా ప్రతీది చాలా నేచురల్‌గా తీశారు. ఇది రొటీన్ పొలిటికల్ సినిమా కాదు. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
-ఆర్ఆర్ ఇందులో చాలా క్రూషియల్. అలాగే నాలుగు పాటలు ఉన్నాయి. ఆ నాలుగు కూడా సిచువేషనల్ సాంగ్స్ మోంటేజెస్. కథకు అనుగుణంగానే వస్తాయి.
విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఆశిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.


