
📌 Key Points
- అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా నుంచి భాగ్యశ్రీ ‘భారతి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.
- భాగ్యశ్రీ ఈ సినిమాలో పల్లెటూరి యువతి ‘భారతి’ పాత్రలో కనిపించనుంది.
- మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగార్జున, నాగ వంశీ నిర్మిస్తున్నారు.
- తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ ‘భారతి’ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరి అమ్మాయిగా భాగ్యశ్రీ పోస్టర్ లో ఆకట్టుకుంది. వేసవిలో సినిమా విడుదల కానుంది.
అఖిల్ ‘లెనిన్’ మూవీ డీటెయిల్స్
అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మెరువనున్నారు. ముందుగా ఈ సినిమాలో శ్రీ లీలను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. కానీ చివరి క్షణంలో భాగ్య శ్రీ ఫైనల్ అయింది. ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీ పోస్టర్ వదిలింది చిత్ర బృందం. ఈ మూవీలో భారతి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనున్నారట. లేటెస్ట్ గా విడుదలైన భారతి పోస్టర్ లో పల్లెటూరి అమ్మాయిల భాగ్యశ్రీ మెరిసింది. కాగా అక్కినేని అఖిల్ నటిస్తోన్న ఈ లెనిన్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
‘భారతి’గా భాగ్యశ్రీ మెరుస్తోంది!
లెనిన్ సినిమా ముఖ్య విశేషాలు
లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ భారతి పాత్రలో అఖిల్ సరసన సందడి చేయనుంది. గ్రామీణ లుక్ తో ఆకట్టుకున్న ఈ నటి సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


