|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bhagyashri borse: హిట్ కోసం పరితపిస్తున్న బ్యూటీ.. ఆ సినిమా ఆశలు తీర్చేనా?

Published: 19-04-2026, 11:05 AM
Bhagyashri borse: హిట్ కోసం పరితపిస్తున్న బ్యూటీ.. ఆ సినిమా ఆశలు తీర్చేనా?

సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకోవాలి అన్నా, స్టార్ హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించాలి అన్నా అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది హిట్స్. విజయాలు ఉన్నవారు చాలా వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం, అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం జరుగుతుంది. అదే సరైన సక్సెస్ లేకపోతే అందం, అభినయం, నటన అన్నీ ఉన్నా కూడా అలాంటివారు తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరం కావాల్సి వస్తుంది. ఇకపోతే కొంతకాలం క్రితమే ఓ నటి కెరీర్ ప్రారంభించింది. అంతలోనే పలు చిత్రాల్లో నటించింది.

వాటిలో తన నటనతో, అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఆమె ఒక మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుతుందని జనాలు భావిస్తున్నారు. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. ఈమె మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు ఈమెకు ఒక్క సరైన విజయం కూడా దక్కలేదు. ప్రస్తుతం ఈ నటి అఖిల్ హీరోగా రూపొందుతున్న లెనిన్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని జూన్ 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రం పైన భాగ్యశ్రీ కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఈమెకు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.