
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ సినిమా నిన్న విడుదలైంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Key Points
భైరవం సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.75 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది.
ఓవర్సీస్‌లో 50 వేల డాలర్లు వసూలు చేసింది.
ఖలేజా రీ రిలీజ్ భైరవం కలెక్షన్లను ప్రభావితం చేసి ఉండవచ్చు.
తమిళ హిట్ 'గరుడన్' రీమేక్ ఇది.
తొలిరోజు వసూళ్ల వివరాలు
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘భైరవం’. నిన్న థియేటర్లలోకి వచ్చింది. చాలావరకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ జనాలు మాత్రం కొంతమేర బాగానే థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ చిత్రానికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?
ఓవర్సీస్ కలెక్షన్స్
ముగ్గురు హీరోలు నటించిన ఈ మినీ మల్టీస్టారర్ మూవీ.. తమిళ హిట్ ‘గరుడన్’కి రీమేక్. అయినా సరే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు చేశారు. తొలిరోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఖలేజా’ రీ రిలీజ్ కావడం ఓ రకంగా దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చేమో. ఎందుకంటే మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రేక్షకులు మహేశ్ మూవీకి ఓటేశారు.
భైరవం చిత్రానికి ఓవర్సీస్‌లోనూ పర్వాలేదనిపించే ప్రారంభం దక్కింది. తొలిరోజు 50 వేల డాలర్లు వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్ కలెక్షన్ పోస్టర్ ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. కథ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఊరు. గజపతి (మనోజ్), వరద (నారా రోహిత్), శీను ఫ్రెండ్స్. అయితే గజపతి కుటుంబం.. ఓ అమ్మవారి ఆలయానికి ట్రస్టీగా ఉంటారు. ఆలయానికి చెందిన వెయ్యి కోట్ల విలువైన భూమిపై ఓ మంత్రి కన్నేస్తాడు. దీని వల్ల ముగ్గురు హీరోల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి. చివరకు ఏమైందనేదే స్టోరీ.
‘ఖలేజా’ ప్రభావం
మొత్తం మీద, ముగ్గురు హీరోల సినిమా ‘భైరవం’ తొలిరోజు మిశ్రమ స్పందనను పొందినప్పటికీ, దాని వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. మరిన్ని రోజుల తర్వాత కలెక్షన్ల పూర్తి వివరాలు తెలుస్తాయి.


