|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివ్యని విచిత్రమైన రీజన్ తో నామినేట్ చేసిన భరణి, ఇమ్మాన్యుయేల్ ని తప్ప అందరినీ ఇరికించిన బిగ్ బాస్

Published: 10-11-2025, 2:42 PM
దివ్యని విచిత్రమైన రీజన్ తో నామినేట్ చేసిన భరణి, ఇమ్మాన్యుయేల్ ని తప్ప అందరినీ ఇరికించిన బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 64వ రోజు నామినేషన్ల పర్వం అనేక మలుపులతో సాగింది. భరణి దివ్యని విచిత్రమైన కారణంతో నామినేట్ చేయగా, బిగ్ బాస్ చివర్లో అందరినీ నామినేట్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం ఇమ్మాన్యుయేల్ ఒక్కడే సేఫ్‌గా ఉండటం గమనార్హం.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 64వ రోజు నామినేషన్ల ప్రక్రియ విచిత్రంగా సాగింది.

2

భరణి దివ్యని తన గేమ్ పాడవడానికి కారణమని ఆరోపిస్తూ విచిత్రమైన రీజన్ తో నామినేట్ చేశారు.

4

కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కి మాత్రమే నామినేషన్ల నుంచి మినహాయింపు లభించింది.

బిగ్ బాస్ 9: 64వ రోజు నామినేషన్ల పర్వం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 64వ రోజు నామినేషన్ల పర్వం విచిత్రంగా సాగింది. ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి హౌస్ లో ఉండకూడదు అని భావించే వారిని నామినేట్ చేయాలి. దానికి కారణాలు చెప్పాలి. నామినేట్ అయిన సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కుర్చీలో కూర్చుంటే బురదనీళ్ళు వాళ్లపై పడతాయి.

ఈ ప్రక్రియలో ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ వచ్చారు. తనూజ.. గౌరవ్ ని నామినేట్ చేసింది. గౌరవ్ కి ఏ విషయంలోనూ క్లారిటీ ఉండడం లేదని ఆరోపించింది. గౌరవ్ కూడా అంటే గట్టిగా తనూజపై రియాక్ట్ అయ్యాడు. తనూజ వాదన అయ్యాక గౌరవ్ బురద నీటిలో తడిచాడు.

భరణి విచిత్రమైన రీజన్ తో దివ్య నామినేషన్

ఆ తర్వాత భరణి.. దివ్యని నామినేట్ చేశారు. భరణి చేసిన నామినేషన్ చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమైన వాదనని భరణి వినిపించేసరికి దివ్య కోపం కట్టలు తెంచుకుంది. అసలు భరణి ఏమన్నారంటే.. నా గేమ్ పాడవ్వడానికి కారణం దివ్య అని హౌస్ లో అందరూ అంటున్నారు. నేను ఎలిమినేట్ కావడానికి కారణం కూడా ఆమెనే అని అంటున్నారు. అది తప్పు అని దివ్య తనని తాను ప్రూవ్ చేసుకోవాలి.

ఈ నామినేషన్ ద్వారా దివ్య తనపై వస్తున్న ఆరోపణలు అబద్దం అని ప్రూవ్ చేయాలి అని భరణి అన్నారు. అసలు నావల్ల మీ గేమ్ పాడైందా ? మీరు చెప్పండి ? అది నిజం కాదు అని తెలిసినప్పుడు నన్ను ఎలా నామినేట్ చేస్తారు అంటూ దివ్య భరణిపై విరుచుకుపడింది. ఆ తర్వాత సంజన కూడా గౌరవ్ నే నామినేట్ చేసింది. నిఖిల్.. రీతూ చౌదరిని నామినేట్ చేశారు. రీతూ చౌదరి తాను కెప్టెన్ కాలేనని, తాను వేస్ట్ అంటూ అవమానించింది అని నిఖిల్ ఆరోపించి ఆమెని నామినేట్ చేశారు.

బిగ్ బాస్ ట్విస్ట్: అందరూ నామినేట్, ఇమ్మాన్యుయేల్ సేఫ్

నామినేషన్స్ మొత్తం అయ్యాక బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ నేను అనుకున్నట్లు జరుగుతాయి. హౌస్ లో ఉన్నవారందరిని నేను నామినేట్ చేస్తున్నా. ఈ వారం ఇంటి సభ్యులు ప్రేక్షకుల నుంచి ఎవరెవరు ఎంత ఓటింగ్ పొందుతారు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నా. అందుకే అందరినీ నామినేట్ చేస్తున్నా. ఈ నామినేషన్స్ లో కెప్టెన్ కూడా ఉండాలా లేదా అతడికి మినహాయింపు ఇవ్వాలా అనేది ఇంటి సభ్యులు సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఆ ఓటింగ్ లో కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయేల్ కి అనుకూలంగా హౌస్ మొత్తం ఓట్ చేశారు. ఒక్క భరణి తప్ప. దీనితో నామినేషన్స్ నుంచి ఇమ్మాన్యుయేల్ కి మినహాయింపు లభించింది. సో ఈవారం ఇమ్మాన్యుయేల్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్లు ఊహించని మలుపు తిరిగాయి. భరణి, దివ్య మధ్య వాగ్వాదాలు, బిగ్ బాస్ ట్విస్ట్ ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాయి. ఇమ్మాన్యుయేల్ మినహా అందరూ నామినేట్ కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.