
📌 Key Points
- భీమ్స్ సిసిరోలియోకి బాలీవుడ్ లో భారీ అవకాశం, టాలీవుడ్ సంగీత దర్శకుడిగా సత్తా చాటుతున్న భీమ్స్.
- రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్ లో వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు.
- ధమాకా సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన భీమ్స్, ఇప్పుడు బాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తారా?
- భీమ్స్ మ్యూజిక్ అందించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా పాటలు సూపర్ హిట్!
టాలీవుడ్ లో తన మ్యూజిక్ తో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తున్నాడు. రవితేజ స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇక బాలీవుడ్ లో కూడా మాస్ బీట్స్ తో దుమ్ము రేపడం ఖాయం!
బాలీవుడ్ లో భీమ్స్ సిసిరోలియో సంచలనం!
Bheems Ceciroleo: సినిమా ఇండస్ట్రీ అనేది.. ఎప్పుడు.. ఎవరికీ.. ఎలాంటి అవకాశాలు ఇస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఇక్కడ కష్టంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. లేదంటే కెరీర్ కష్టమే. ఇప్పుడు అదే స్టేజిలో ఉన్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన కంపోజ్ చేసినా పాటలే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈయన మ్యూజిక్ అందించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా, ఆ సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
నిజానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇక ఇదే సీజన్ లో భీమ్స్(Bheems Ceciroleo) మ్యూజిక్ అందించిన మరో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవి తేజ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు భీమ్స్. అయితే, ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న భీమ్స్ కి ఈసారి బంపర్ ఆఫర్ దక్కిందట. ఏకంగా బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్నాడట భీమ్స్.
రవితేజ ప్రకటనతో వైరల్ గా మారిన న్యూస్!
ఈ విషయాన్ని స్వయంగా హీరో రవి తేజ చెప్పడం గమనార్హం. రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో రవి తేజ మాట్లాడుతూ.. “మా సినిమాకు భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. కానీ, ఇవాళ ఇక్కడికి రాలేకపోయాడు. ప్రస్తుతం అతను ముంబైలో బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించే పనిలో ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో భీమ్స్ బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ధమాకా నుండి బాలీవుడ్ వరకు భీమ్స్ జర్నీ!
నిజానికి, భీమ్స్ గీత రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ముందు కొన్ని సినిమాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో చనిపోదాం అని అనుకున్నాడట భీమ్స్. ఆ తరువాత వచ్చిన ధమాకా సినిమాతో అతని లైఫ్ టర్న్ అయ్యింది. అక్కడినుంచి వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు భీమ్స్. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించే రేంజ్ కి వెళ్ళాడు. అయితే, ఆ సినిమా ఏది, హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
భీమ్స్ సిసిరోలియో బాలీవుడ్ లో ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి!


