
మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో భావోద్వేగ ప్రసంగం వైరల్ అయ్యింది. తాను బతికి ఉండటానికి, కెరీర్‌లో నిలబడటానికి మాస్ మహారాజా రవితేజ సర్ కారణమని, దేవుడిలా ఆదుకున్నారని భీమ్స్ ఎమోషనల్ అయ్యారు.
Key Points
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ గురించి ఎమోషనల్ అయ్యారు.
తాను బతికి ఉండటానికి రవితేజ సర్ కారణమని భీమ్స్ భావోద్వేగంగా వెల్లడించారు.
కష్టకాలంలో దేవుడిలా ఆదుకున్న వ్యక్తి, శక్తి రవితేజ అని భీమ్స్ ప్రశంసించారు.
ధమాకా నుండి చిరంజీవి సినిమా వరకు రవితేజ ప్రోత్సాహం గురించి వివరించారు.
మాస్ జాతర వేదికపై భీమ్స్ ఎమోషనల్
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరిలియో ఎమోషనల్ అయిపోయాడు. మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ గురించి మాట్లాడుతూ.. తనను ఆదుకున్న దేవుడు, తన కోసం నిలబడిన శక్తి రవితేజ సర్ అంటూ భీమ్స్ చాలా భావోద్వేగంతో చెప్పగానే ఆడిటోరియం మార్మోగిపోయింది.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో.. మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈరోజు బతికి ఉండటానికి కారణంగా రవితేజ సర్ అని అతడు అనడం గమనార్హం. తనను ఆదుకున్న దేవుడు, తన కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.
భీమ్స్ సీసిరోలియో ఏమన్నాడంటే?
రవితేజ సాయంతో బతికాను: భీమ్స్
“నేను ఇవాళ ఓ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. నేను ధమాకా చేసినప్పటి నుంచి చిరంజీవి సర్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు. నేను ఓ పాట పాడుతూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్న సమయంలో నా భార్యా పిల్లలకు అది ఎందుకు తీస్తున్నానో తెలియదు. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి.. పిల్లలను ఎలా చదివించాలి అని బాధపడుతున్నాను. అప్పుడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది.
నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి.. ఇక నేను, నా భార్యాపిల్లలతో కట్టగట్టుకొని పైకి వెళ్లిపోదామనుకున్నాను. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా, ఓ జీసస్ లాగా, ఓ అల్లాలాగా, రాముడిగా, తిరుపతి వెంకన్న నా జీవితంలో ఓ వ్యక్తి వచ్చారు. నన్ను ఆదుకున్న దేవుడు.. నా కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ సర్. ఇవాళ నేను సజీవంగా ఉండటానికి కారణం.. అమ్మా, నాన్నా తెలుసుకోండి.. ఆ వ్యక్తి రవితేజ సర్ ” అని భీమ్స్ సీసిరోలియో అనడంతో ఆడిటోరియం అంతా మార్మోగిపోయింది.
భీమ్స్ సినీ కెరీర్, కృతజ్ఞత
భీమ్స్ సీసిరోలియో గురించి..
ఆ తర్వాత బలగం, రావణాసుర, టిల్లూ స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడు మాస్ జాతర, తర్వాత చిరంజీవి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారులాంటి మూవీస్ తో తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు. అయితే అంతా అయిపోయిందనుకున్న సమయంలో తనకు అవకాశం ఇచ్చిన రవితేజను మాత్రం భీమ్స్ మరచిపోలేదు. తాజాగా అతడు ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
భీమ్స్ సీసిరోలియో తన జీవితంలో రవితేజ సార్ పాత్రను భావోద్వేగంగా వెల్లడించారు. కష్టకాలంలో ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం మరువలేనిదని, ఈ స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని, వారి బంధం ఎంత బలమైనదో స్పష్టమవుతుందని చెప్పవచ్చు.


