|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భూమి పెడ్నేకర్ సంచలనం: ఆ సినిమా ఫ్లాప్తో నా కెరీర్ ఐపోయిందనుకున్నా! షాకింగ్ కామెంట్స్ వైరల్!

Published: 21-03-2026, 10:05 AM
భూమి పెడ్నేకర్ సంచలనం: ఆ సినిమా ఫ్లాప్తో నా కెరీర్ ఐపోయిందనుకున్నా! షాకింగ్ కామెంట్స్ వైరల్!
  • భూమి పెడ్నేకర్ సంచలన ప్రకటన: నా కెరీర్‌లో ది లేడీ కిల్లర్ చిత్రం ఒక గుణపాఠం!
  • పాత్ర కోసం శారీరక మార్పులు చేసుకున్న భూమి, ఇండస్ట్రీలో ఎవరూ చేయని సాహసం!
  • ‘ది లేడీ కిల్లర్’ చిత్రం వైఫల్యం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను దెబ్బతీసింది అంటున్న భూమి.
  • భూమి పెడ్నేకర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అధూరే హమ్ అధూరే తుమ్’.. షూటింగ్ పూర్తి!

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ సంచలన ప్రకటన చేసింది. తన కెరీర్లో ఎదురైన సవాళ్ల గురించి, ‘ది లేడీ కిల్లర్’ సినిమా ఫెయిల్యూర్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

భూమి పెడ్నేకర్ కెరీర్లో సవాళ్లు!

ఇండస్ట్రీలో నిలబడాలి అంటే శారీరకంగా ఎన్నో మార్పులు చేసుకోవాలి అంటుంది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ‘దశాబ్ద కాలంగా చిత్రపరిశ్రమలో నా ప్రయాణం సాగుతోంది. పాత్రల కోసం ఎన్నో శారీకర మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇలా ఏ నటి కూడా చేయలేదేమో. అలాగే నా కెరీర్‌లోనే ‘ది లేడీ కిల్లర్’ చిత్ర వైఫల్యం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇక నా పనైపోయిందనుకున్న. మొదట నాకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో నా పాత్ర పరిపూర్ణంగానే ఉంది. కానీ అందులో చాలా భాగాల్ని తెరకెక్కించలేదు. అసంపూర్తిగా సినిమాను విడుదల చేశారు. ఇది నాకు ముందే తెలిసుంటే బాగుండేది. నేను కూడా మేకింగ్‌లో భాగమై ఉంటే కొన్ని విషయాల్ని మార్చగలిగేదాన్ని. అయినా జరిగినదానికి నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. ఈ సినిమా పరిస్థితి ఏంటా అని భయపడ్డాను. చివరకు ఇదొక గుణపాఠంలా భావించి నాకు నేను సర్దిచెప్పుకున్నా’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘అధూరే హమ్ అధూరే తుమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

‘ది లేడీ కిల్లర్’ వైఫల్యంపై స్పందన

కొత్త సినిమాతో భూమి రీ ఎంట్రీ!

భూమి పెడ్నేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.