|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న ‘బిచ్చగాడు-3’.. బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోని.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Published: 26-06-2025, 10:19 AM
సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న ‘బిచ్చగాడు-3’.. బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోని.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Key Points

1

విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు-3’ సినిమాను దర్శకత్వం వహించనున్నారు.

2

2027 సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది.

3

‘బిచ్చగాడు’ సిరీస్‌లో మూడవ భాగం అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

‘బిచ్చగాడు-3’ రిలీజ్ డేట్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ‘పిచ్చైకారన్’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘బిచ్చగాడు’గా రీమేక్ చేశారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా.. విజయ్ ఆంటోని, సాట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిన ‘బిచ్చగాడు-2’(Bichagadu-2) మాత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు-3’ (Bichagadu-3)రాబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా 2027లో సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి స్వయంగా విజయ్ దర్శకత్వం చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు సంతోష పడుతున్నారు. కాగా, విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మార్గన్’. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా… సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్‌పై జె.రామాంజనేయులు సమర్పిస్తున్నారు. లియో జాన్‌పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖా, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

విజయ్ ఆంటోని దర్శకత్వం

అభిమానుల ఆనందం

‘బిచ్చగాడు-3’ సినిమా విడుదలకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ ఆంటోని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.