|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దశాబ్ధాల బంధానికి బిగ్‌బి కటీఫ్‌..కౌన్‌ బనేగా కెబీసీ పతి?

Published: 23-05-2025, 12:45 AM
దశాబ్ధాల బంధానికి బిగ్‌బి కటీఫ్‌..కౌన్‌ బనేగా కెబీసీ పతి?

దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్ పతి షోకు దశాబ్దాల పాటు హోస్ట్ గా వ్యవహరించిన అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఆ షో నుంచి వైదొలగనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో సల్మాన్ ఖాన్ రానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Key Points

1

రెండు దశాబ్దాలకు పైగా కౌన్ బనేగా కరోడ్ పతికి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించారు.

2

వ్యక్తిగత కారణాల వల్ల అమితాబ్ బచ్చన్ కెబిసి నుంచి నిష్క్రమించనున్నారని వార్తలు.

4

సోనీ టీవీ ఇంకా ఈ మార్పును ధృవీకరించలేదు.

అమితాబ్ బచ్చన్ కెబిసికి గుడ్ బై చెబుతున్నారా?

కౌన్‌ బనేగా కరోర్‌ పతి(Kaun Banega Crorepati ) అంటే అమితాబ్, అమితాబ్‌ అంటే కెబిసి  అన్నంతగా పెనవేసుకుపోయిన బంధం తెగిపోనుందా? దేశంలో మరెన్నో టీవీ షోలకు ఊపిరిపోసిన ఆ టెలివిజన్‌ షో సమర్పకుడికి స్థాన చలనం తప్పదా? భారతీయ టెలివిజన్‌ రంగంలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతున్న వార్త ఇది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఐకానిక్‌ క్విజ్‌ షోకు సారధ్యం వహించిన  లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇక ఆ బాధ్యతకు గుడ్‌ బై చెప్పనున్నారు.

రెండున్నర దశాబ్ధాల క్రితం అంటే 2000లో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క  మూడవ సీజన్‌ మినహా అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) ఫేస్‌ ఆఫ్‌ కెబిసీగా  ఉన్నారు. ఒక్క 3వ సీజన్‌ను మాత్రం షారుఖ్‌ ఖాన్‌ హోస్ట్‌ చేశారు. ఆ ఒక్క సీజన్‌ తప్ప మరెప్పుడూ ఆ షోకి దూరం కాని, ఈ 81 ఏళ్ల బాలీవుడ్‌ స్టార్‌…వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి నిష్క్రమిస్తున్నారని ఇటీవలి నివేదికలు ధృవీకరిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ కొత్త హోస్ట్ గా?

ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేది మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలను మేల్కొలిపే వార్త కూడా. ఈ విజయవంతమైన షోని అందిస్తున్న సోనీ టీవీ ఇంకా ఈ మార్పును ధృవీకరించనప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న సీజన్‌ 17 కోసం బిగ్‌ బి స్థానంలో కొత్త హోస్ట్‌ రావచ్చనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. దీంతో తదుపరి షో ప్రెజెంటర్‌ ఎవరు అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ షో పట్ల ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావం చూపిన బిగ్‌ బీ ఛెయిర్‌లో కూర్చోవడానికి బాలీవుడ్‌ ప్రముఖులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదని సమాచారం.

ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ హంగామా నుంచి అందుతున్న ఒక నివేదిక ప్రకారం, బాలీవుడ్‌ ’భైజాన్‌’ – సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) తో షోరన్నర్లు ముందస్తు చర్చలు జరుపుతున్నారంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, బిగ్‌ బాస్‌ షో ద్వారా  చిన్న తెరపై బిగ్‌ బీ తర్వాత ఆ స్థాయిలో  పేరుగాంచిన సల్లూ భాయ్‌ భారతదేశపు అత్యంత విజయవంతమైన పురాతన షో… కేబీసీకి కొత్త హోస్ట్‌గా రానున్నాడు.

సోనీ టీవీ ప్రకటన ఎప్పుడు?

ఈ వార్తల నేపధ్యంలో ‘‘ సల్మాన్‌ ఖాన్‌ కు ఉన్న విస్త్రుత ప్రజాదరణ, ఆయనను బిగ్‌ బికి సరైన వారసుడిగా మార్చగలదని టీవీ పరిశ్రమలోని వ్యక్తులు భావిస్తున్నారు., ‘సల్మాన్‌ చిన్న తెరకు ఇప్పటికే చిరపరిచితమైన స్టార్‌. పైగా ఆయన మారుమూల కేంద్రాలలోని ప్రేక్షకులతో సైతం బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ సరిగ్గా జరిగితే, అతను ఈ షోను తుఫానుగా తీసుకెళ్లగలడు‘ అని ఒక బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.

సల్మాన్‌ ఖాన్‌ నిజంగా అమితాబ్‌ బచ్చన్‌ స్థానంలోకి వస్తే, అభిమానులు ఆయనను  నిశితంగా గమనిస్తారు. బిగ్‌ బి  అత్యున్నత స్థాయి ప్రజెంటేషన్‌తో పోలికలు తప్పవు. అయితే సల్మాన్‌ ఖాన్‌ కు వీక్షకుల్లో ఉన్న ఆకర్షణ  మాస్‌ అప్పీల్‌ కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఏదేమైనా కేబీసీ సీజన్‌ 17 వచ్చే ఆగస్టులో  ప్రారంభమయే అవకాశం ఉంది, ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి, అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి సోనీ టీవీపైనే  ఉంది.

అమితాబ్ బచ్చన్ వైదొలగడం కెబిసి అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ, కొత్త హోస్ట్ ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ రావడం షోకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.