
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. రాము రాథోడ్ ఎలిమినేషన్ ప్ర్యాంక్ తర్వాత, లీకుల ప్రకారం రమ్య మోక్ష హౌస్ నుండి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎనిమిదవ వారంలోకి అడుగుపెడుతోంది.
రాము రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరిగినా, అది ఒక ప్ర్యాంక్ అని తరువాత తెలిసింది.
ఈ వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు, ఓటింగ్ తీవ్ర పోటీని సూచిస్తుంది.
తాజా లీకుల ప్రకారం, రమ్య మోక్ష ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ 9: ఈ వారం ఎలిమినేషన్ ట్విస్ట్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముందు కాస్త చప్పగా అనిపించినా.. ఆతరువాత మసాలా డోస్ పెంచేస్తున్నారు.. రోజు రోజుకి ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది ఈసీజన్. ప్రతీ వీక్ ఎండ్ కు ఎలాంటి ట్విస్ట్ లు చూడాల్సి వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఏడవ వారం పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టబోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్9. ప్రతి వీకెండ్ ఎలిమినేషన్ కామన్.. కానీ ఈమధ్య అందులో కూడా ఎన్నో ట్విస్ట్ లు చూపిస్తున్నారు టీమ్. ఇక ఈవారం ఎలిమినేషన్ ఎవరు..? అందరు అనుకుని ఊహించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారా..? వీకెండ్ బిగ్ బాస్ ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటీ?
ఈ వారం ఎలిమినేషన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వీక్ ఎవరు బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్లబోతున్నారు అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తగ్గట్టు వారు పేర్లు వెల్లడిస్తున్నారు. ఈ లిస్ట్ లో అనేక మంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే అందరి చూపు ఫోక్ సింగర్ రాము రాథోడ్ మీద ఉంది. ఈ వార రాము ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అని అంతా ఊహించారు. అందుకు తగ్గట్టుగానే హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ అమర్ దీప్ పోలీస్ గెటప్స్ లో వచ్చి రామును ఎలిమినేట్ చేసి తీసుకెళ్లారు. దాంతో హౌస్ లో గంభీరమైన వాతావరణం ఏర్పడింది. ఇంతలో ట్విస్ట్ ఇస్తూ.. ఇది ప్రాంక్ అని ప్రకటించారు. మరి నిజంగా ఇది ప్రాంకా.. లేక రాము రాథోడ్ ను నిజంగానే వీకెండ్ లో పంపించబోతున్నారా? అని పెద్ద చర్చ జరుగుతోంది.
రాము రాథోడ్ ఎలిమినేషన్.. నిజమా, ప్ర్యాంకా?
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రమ్య మోక్ష , రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖిత, తనూజ , రాము రాథోడ్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. కెప్టెన్లుగా ఉన్న సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలు మాత్రం నామినేషన్‌లకు మినహాయింపు పొందారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం తనూజ అత్యధిక ఓట్లతో ముందంజలో ఉంది. ఆమె 37.46 శాతం ఓటింగ్ సాధించింది. ఆ తరువాతి స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల 20.42 శాతం, దివ్య నిఖిత 9.81 శాతం, రాము రాథోడ్ 8.86 శాతం, సంజన గల్రానీ 8.81 శాతం, రీతూ చౌదరి 6.49 శాతం, సాయి శ్రీనివాస్ 4.83 శాతం, రమ్య మోక్ష 3.31 శాతం ఓటింగ్ సాధించారు. ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రమ్య మోక్ష ఈవారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజా ఓటింగ్, రమ్య మోక్ష ఎలిమినేషన్ వివరాలు
రమ్య మోక్ష హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది. అందరి విషయంలో తలదూర్చడం.. పర్సనల్ విషయాలు కదిలించడంతో పాటు.. పవన్ కళ్యాన్ ను పర్సనల్ కామెంట్స్ చేయడం ఆమెకు బాగా నెగెటీవ్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. మరీముఖ్యంగా మాధురీతో కలిసి ఆమె చేస్తున్న కామెంట్స్ ఆడియన్స్ కు నచ్చడంలేదు. హౌస్ మెంట్స్ పై సర్సనల్ గా మాట్లాడటం కూడా ఆమె ఇమేజ్ ను దెబ్బతీసింది. లాస్ట్ వీకెండ్ లో నాగార్జున హెచ్చరించిన తరువాత కూడా ఆమె.. ఇలాంటివి మానుకోలేదు. అంతే కాదు ఇంట్లో పెద్దగా యాక్టీవ్ గా కూడా ఉండటంలేదు. ఇలాంటి విషయాలు చాలా ఆమెకు నెగెటీవ్ గా మారాయి. దాంతో ఆమె ఓటింగ్ లో వెనకబడటంతో.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని మరో వాదన కూడా వినిపిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ ట్విస్ట్‌తో కొనసాగింది. రాము రాథోడ్ ప్ర్యాంక్ తర్వాత, రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి. హౌస్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


