|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎల్ల‌మ్మ కోసం భారీ ప్లాన్‌… హీరోగా DSP ?

Published: 17-10-2025, 12:24 AM
ఎల్ల‌మ్మ కోసం భారీ ప్లాన్‌... హీరోగా DSP ?

బలగం దర్శకుడు వేణు రూపొందిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా కోసం హీరో వేట కొనసాగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్, నాని వంటి స్టార్ హీరోలను సంప్రదించారు. అయితే, ఇప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా నటించనున్నారని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Key Points

1

బలగం దర్శకుడు వేణు 'ఎల్లమ్మ' అనే కొత్త ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.

2

ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ఖరారైంది.

4

తాజాగా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా 'ఎల్లమ్మ'లో నటించనున్నారని టాలీవుడ్‌లో వార్తలు.

వేణు కొత్త ప్రాజెక్టు ‘ఎల్లమ్మ’

దిశ‌, వెబ్ డెస్క్ : బలగం సినిమాతో స్టార్ అయిపోయిన కమెడియన్ వేణు ఎల్లమ్మ ప్రాజెక్టు పట్టుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. 2023 నుంచి ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు వేణు. అయితే ఇప్పటి వరకు హీరోను మాత్రం ఫైనల్ చేయలేదు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వస్తోందని ఇప్పటికే రివీల్ కాగా, హీరోను మాత్రం ఫైనల్ చేయలేదు. ఇప్పటి వరకు నలుగురు హీరోల వద్దకు ఈ కథ వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. నితిన్, హీరో నాని, శర్వానంద్ వద్దకు ఈ సినిమా కథ వెళ్ళిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు కూడా ఎల్లమ్మ కథ వెళ్లినట్లు జోరుగా చర్చ జరిగింది. దీంతో బెల్లంకొండ ఫైనల్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఇంతలోనే మరో ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రాజెక్టులోకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ రాబోతున్నారట. అది కూడా దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా చేసేందుకు వేణు సిద్ధమైనట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరు అందుకుంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన ఎక్కడ చేయలేదు. కానీ డీఎస్పీ పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది.

హీరో వేటలో ఆసక్తికర మలుపులు

దేవిశ్రీప్రసాద్ హీరోగా ప్రచారం

మొత్తంగా, ‘ఎల్లమ్మ’ సినిమా హీరో ఎంపికలో నెలకొన్న ట్విస్ట్‌ ఆసక్తి రేపుతోంది. దేవిశ్రీప్రసాద్ హీరోగా నిజంగానే తెరపైకి వస్తారా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. ఈ వార్త టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.