
📌 Key Points
- ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా రూ.195.50 పెరిగింది.
- ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2078కి చేరింది.
- హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2301కి పెరిగింది.
- డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడిన నేపథ్యంలో సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఆయిల్ కంపెనీలు 19 కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
కమర్షియల్ సిలిండర్ ధరలకు రెక్కలు
దేశ వ్యాప్తంగా LPG కొరత ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది. ప్రతి నెల ఒకటో తేదీన ధరల మార్పు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల సిలిండర్ పైన రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
గత నెలలో ఇదే సిలిండర్ పై రూ.115 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల దాదాపు మరో వంద రూపాయలు పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో గృహ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2078కు చేరింది. హైదరాబాద్ మహానగరంలో ఇదే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2301 చేరుకుంది. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.965గా కొనసాగుతోంది.
దేశ రాజధానిలో కొత్త ధరలు
తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు
సిలిండర్ ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని పలువురు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


