|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9: అమ్మ నన్ను కనొద్దనుకుంది.. కన్నీళ్లు తెప్పిస్తున్న కంటెస్టెంట్లు

Published: 14-11-2025, 5:09 AM
Bigg Boss 9: అమ్మ నన్ను కనొద్దనుకుంది.. కన్నీళ్లు తెప్పిస్తున్న కంటెస్టెంట్లు

బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్లు తమ చిన్ననాటి తీపి, చేదు జ్ఞాపకాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా వారి ఫోటోలను చూసి, తమ జీవితాల్లో ఎదురైన కష్టాలు, తల్లిదండ్రుల ప్రేమ, త్యాగాలను గుర్తుచేసుకున్నారు. వారి కన్నీటి గాథలు ప్రేక్షకులను కదిలించాయి.

Key Points

1

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లు బాలల దినోత్సవం సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.

2

తనూజ తన తల్లిని తన జీవితానికి సూపర్‌ హీరోగా అభివర్ణించి, భావోద్వేగానికి లోనైంది.

4

కల్యాణ్ హాస్టల్ జీవితం, ఫోన్ కోసం ఎదురుచూసిన రోజులను గుర్తు చేసుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.

తనూజ: అమ్మే నా సూపర్‌ హీరో

బిగ్‌బాస్‌ షో ( Bigg Boss Telugu 9 ) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్‌ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్‌ సెల్ఫ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈరోజు (నవంబర్‌ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

లవ్యూ అమ్మా: తనూజ వాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్‌ సూపర్‌ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.

ఇమ్మాన్యుయేల్ కన్నీటి గాథ: అమ్మ మట్టి తినేది

తినడానికి తిండి లేక మట్టి ఇక ఇమ్మాన్యుయేల్‌ ( Emmanuel )కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో.

చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్‌ చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్‌.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్‌లో జాయిన్‌ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్‌ కోసం వార్డెన్‌ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్‌ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

కల్యాణ్ బాల్యం: హాస్టల్ కష్టాలు

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు పంచుకున్న వ్యక్తిగత కథలు అందరినీ కదిలించాయి. జీవితంలో ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించిన వారి ప్రయాణాలు అనేక మందికి స్ఫూర్తినిస్తాయి. ఈ భావోద్వేగ ఎపిసోడ్ ప్రేక్షకులలో సానుభూతిని రేకెత్తించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.