
బిగ్‌బాస్-9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్వెల మాధురి ప్రవేశించి, తొలిరోజే అలజడి సృష్టించింది. వంట పనుల ఆలస్యంపై కళ్యాణ్, దివ్యలతో మాధురి వాగ్వాదానికి దిగింది. ఆమె పెత్తనం చెలాయించబోతే ఊహించని షాక్ ఎదురైంది. చివరకు కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది.
Key Points
దివ్వెల మాధురి బిగ్‌బాస్-9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించారు.
వంట పనులు ఆలస్యం చేయడంపై కళ్యాణ్, దివ్యలతో మాధురి వాగ్వాదానికి దిగింది.
వెటకారపు మాటలు, అరుపులపై హౌస్మేట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెత్తనం చెలాయించబోయి చివరకు కన్నీరు పెట్టుకున్న దివ్వెల మాధురి.
బిగ్‌బాస్ హౌస్‌లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్‌బాస్-9 (Bigg Boss-9)6 వారంలోకి ఎంటర్ అవడంతో పాటు ఆరుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వెళ్లారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి. ఆమె ఇంట్లోకి వెళ్లి కొద్ది గంటలే అవుతున్నప్పటికీ అందరితో గొడవలు పడటం మొదలెట్టింది. ఇక వంట పనులు అప్పగించగా.. లేట్ చేసింది. దీంతో ఫుల్ ఫ్రస్టేషన్‌లో మిగతా హౌస్‌మెట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. కళ్యాణ్ ఆమెతో మాట్లాడటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచి కూర్చిలో కూర్చోమన్నాడు. దానికి దివ్వెల మాధురి వెటకారంగా కూర్చోకపోతే ఊరుకోరా అనేసింది.
వంట పనులపై కళ్యాణ్, దివ్యలతో మాధురి వాగ్వాదం
అయినప్పటికీ ఓపికగా.. వ్యవహరించిన కళ్యాణ్ ఈ రోజు వంట లేట్ అయింది.. రేపటి నుంచి షెడ్యూల్ మారాలని అంటాడు. నేను అరగంట కూర్చున్నప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పడేం చేశారని కెప్టెన్ కళ్యాణ్‌పై సీరియస్ అయింది. దీంతో పక్కనే ఉన్న దివ్య వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. ముగ్గురు పోటాపోటీగా వాదించుకున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని దివ్వెల మాధురి(Divvela Madhuri) కళ్యాణ్(Kalyan), దివ్యపై గట్టి గట్టిగా అరిచింది.
పెత్తనం చెలాయించబోతే ఎదురైన ఊహించని షాక్
దీంతో కళ్యాణ్ గౌరవంతో కూర్చోమని చెప్తే వెటకారంగా మాట్లాడటం అవసరమా అని అరుస్తాడు. దీంతో మాధురి వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్ అని కోపంతో ఊగిపోయింది. అంతలా గొడవపడిన దివ్వెల మాధురి చివరకు కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. పెత్తనం చెలాయించాలనుకుంటే షాక్ తగిలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు మొదటి రోజే చుక్కలు చూపించారుగా? అని అంటున్నారు.
దివ్వెల మాధురి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మొదటి రోజే ఆమెకు చుక్కలు చూపించారని కామెంట్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.


