|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ 9 సంచలనం: ఇమ్మాన్యుయల్ ఔట్, పవన్ సేఫ్! టాప్ 3లో ఎవరు?

Published: 20-12-2025, 10:44 AM
బిగ్ బాస్ 9 సంచలనం: ఇమ్మాన్యుయల్ ఔట్, పవన్ సేఫ్! టాప్ 3లో ఎవరు?
  • సంజన గల్రానీ 5వ స్థానంలో, ఇమ్మాన్యుయల్ 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యారు.
  • డైరెక్టర్ అనిల్ రావి పూడి రూ.15 లక్షల ఆఫర్ చేసినా కంటెస్టెంట్లు తీసుకోలేదు.
  • వ్యతిరేకతను తట్టుకొని డీమాన్ పవన్ టాప్ 3కి చేరుకోవడం గొప్ప విషయం.
  • బిగ్ బాస్ 9 టైటిల్ కళ్యాణ్ లేదా తనూజలలో ఒకరికి దక్కే అవకాశం ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలే లీక్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అభిమానులు ఎంతగానో ఆదరించిన ఇమ్మాన్యుయల్ టాప్ 3లో స్థానం సంపాదించలేక 4వ స్థానంలో నిష్క్రమించడం ఆశ్చర్యపరిచింది. అయితే డీమాన్ పవన్ మాత్రం అంచనాలకు మించి టాప్ 3లోకి దూసుకెళ్లాడు. విజేతపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇమ్మాన్యుయల్ ఔట్: టాప్ 3 కూడా మిస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ మనకు ఆదివారం సాయంత్రం నుంచి టెలికాస్ట్ అవుతుంది. అయితే… ముందుగానే లీక్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ సంజన గల్రానీ.. 5వ స్థానంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో స్థానంలో ఎవరు బయటకు వచ్చారో కూడా తెలిసిపోయింది.

మొదట నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆయన తర్వాత సీజన్ ఓల్డ్ కంటెస్టులు కూడా ఎంట్రీ ఇచ్చారు. వారి డ్యాన్సులు , పలకరింపుల తర్వాత… సంజన ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఆ తర్వాత.. డైరెక్టర్ అనిల్ రావి పూడి.. సూట్ కేసు తో హౌస్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన హౌస్ లోని కంటెస్ట్ లకు దాదాపు రూ.15 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే..ఆ డబ్బులు తీసుకోవడానికి ఎవరూ అంగీకరించలేదని సమాచారం. చివరకు అనిల్ రావి పూడి చాలా సేపటి తర్వాత ఇమ్మాన్యుయల్ ని ఎలిమినేట్ చేసి… బయటకు తీసుకువచ్చారని సమాచారం బయటకు వచ్చింది.

డీమాన్ పవన్ సంచలనం: టాప్ 3లో చోటు

నిజానికి… ఇమ్మాన్యుయల్ టైటిల్ విన్నర్ అవ్వాలనే ఈ సీజన్ కి ఎంట్రీ ఇచ్చారు. విన్నర్ అవ్వాలని అనుకోవడమే కాదు… అందుకోసం చాలా కష్టపడ్డాడు. సీజన్ మొత్తాన్ని చాలా వరకు తన భుజాలపై మోసుకొచ్చాడు. ఇమ్యూ కామెడీ కూడా లేకపోతే.. ఈ సీజన్ కి కనీస గుర్తింపు కూడా వచ్చేది కాదు అనే చెప్పాలి. ఇమ్మూ అంత కష్టపడినా.. విన్నర్ కాలేకపోయాడు. విన్నర్ కావడం పక్కన పెడితే టాప్ 3 లో కూడా చోటు దక్కించుకోలేదు. కమెడియన్స్ ని విన్నర్ చేయరు అని ఆడియన్స్ మరోసారి నిరూపించారు.

బిగ్ బాస్ 9 విజేత ఎవరు?

ఇమ్మాన్యుయల్ 4 వస్థానంలో ఎలిమినేట్ అయ్యాడనే వార్త బయటకు రావడంతో..డీమాన్ పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీమాన్ టాప్ 3 కి కూడా రాకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అసలు డీమాన్ కి ఓట్లు వేయద్దంటూ కొందరు క్యాంపైన్లు కూడా చేయడం గమనార్హం. ఇంత నెగిటివ్ చేసినా కూడా.. డీమాన్ పవన్ తట్టుకొని టాప్ 3 కి చేరుకోవడం చాలా గొప్ప విషయం. టాప్ 3 కి అయితే చేరుకున్నాడు కానీ.. టైటిల్ మాత్రం కళ్యాణ్ కానీ, తనూజకీ కానీ దక్కే అవకాశం ఉంది. వీరిద్దరిలో విజేత ఎవరో తెలియాలంటే మాత్రం రేపటి వరకు ఆగాల్సిందే.

ఇమ్మాన్యుయల్ లాంటి బలమైన పోటీదారులు టాప్ 3కి దూరమైనా, డీమాన్ పవన్ అనూహ్యంగా పుంజుకున్నాడు. బిగ్ బాస్ 9 టైటిల్ కోసం కళ్యాణ్, తనూజ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విజేతను ఆదివారం తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.