
📌 Key Points
- బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేకు ముందు నిధి అగర్వాల్ గెస్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ.
- ఇమ్మాన్యుయేల్ నిధి అగర్వాల్ ని సరదాగా ఆటపట్టించగా, ఆ సన్నివేశాలు వైరల్ గా మారాయి.
- రాజా సాబ్ ప్రమోషన్స్ లో లులు మాల్ వద్ద అభిమానుల కారణంగా నిధి అగర్వాల్ ఇబ్బందులు పడ్డారు.
- నిధి అగర్వాల్ ఇంటి సభ్యులతో కలిసి ఆటలు ఆడుతూ, ఫన్నీగా సంభాషణలు చేసింది.
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేకు ముందే హౌస్ లో సందడి నెలకొంది. అతిథిగా వచ్చిన నిధి అగర్వాల్‌ను ఇమ్మాన్యుయేల్ సరదాగా ఆటపట్టించాడు. బయట ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు హౌస్‌లోనూ రిపీట్ అయ్యాయా అనే చర్చకు దారితీసింది. ఈ సరదా సంఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
బిగ్ బాస్ హౌస్ లో నిధి, ఇమ్మాన్యుయేల్ సందడి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ తెలుగు 9 ముగుస్తుంది. టాప్ 5లో ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్, కళ్యాణ్, తనూజ ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో ఫుల్ హంగామా ఉండబోతోంది. కొందరు సెలెబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గెస్ట్ గా హౌస్ లోకి వెళ్లి కాసేపు టాప్ 5 సభ్యులతో సరదాగా గడిపింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇటీవల నిధి అగర్వాల్ రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని లులు మాల్ ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు ఆమెని చుట్టుముట్టి తీవ్ర అసౌకర్యం కలిగించారు.
బయట షాక్, బిగ్ బాస్ లోనూ అంతేనా?
నిధి అగర్వాల్ ఆ జనం నుంచి నానా తిప్పలు పడి కారు ఎక్కేసింది. ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ కూడా నలిగిపోయే పరిస్థితితి ఏర్పడింది. ఆ సంఘటనలో జనం దారుణంగా బిహేవ్ చేశారు అనే కామెంట్స్ వినిపించాయి. చిత్ర యూనిట్ ప్లానింగ్, సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి.
బయట నిధి అగర్వాల్ కి అలాంటి సంఘటన ఎదురుకాగా.. బిగ్ బాస్ హౌస్ లో ఆమెకి ఇమ్మాన్యుయేల్ చుక్కలు చూపించాడు. కానీ ఇదంతా సరదాగా సాగింది. హౌస్ మేట్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు నిధి అగర్వాల్ కాసేపు వారితో సరదాగా మాట్లాడింది. వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టింది. నిధి అగర్వాల్ రాగానే ఇమ్మాన్యుయేల్ రెచ్చిపోయాడు. పాపలకే పాప నిధి పాప అంటూ కేకలు వేశాడు. నిధి అగర్వాల్ కూడా బాగానే సెటైర్లు వేసింది. టైటిల్ గెలిస్తే మీరు ఏం చేస్తారు అని పవన్ ని అడిగింది. తనకి కొన్ని గోల్స్ ఉన్నాయని చెప్పాడు. ఏంటి గర్ల్స్ ఉన్నాయా ? అంటూ నిధి ఫన్నీగా అడిగింది. దీనితో అంతా నవ్వేశారు.
నిధి అగర్వాల్ పెట్టిన గేమ్స్, సరదా పంచులు
ఆ తర్వాత నిధి అగర్వాల్ ఇంటి సభ్యులకు ఒక గేమ్ పెట్టింది. కళ్ళకు గంతలు కట్టుకుని ఆడే గేమ్ అది. పొరపాటున మిమ్మల్ని ముట్టుకుంటే ఏమీ అనుకోవద్దు అని ఇమ్మాన్యుయేల్ నిధి అగర్వాల్ ని రొమాంటిక్ గా అడగడం నవ్వులు పూయిస్తోంది.
బిగ్ బాస్ హౌస్‌లో నిధి అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బయట ఎదుర్కొన్న అసౌకర్యానికి భిన్నంగా, హౌస్ లోని ఈ సరదా సంఘటనలు ఫినాలేకు మంచి హైప్ తీసుకొచ్చాయి.


