
బిగ్‌బాస్ సీజన్ 9 పదో వారం కీలక దశకు చేరుకుంది. ఈ వారం ఊహించని షాకింగ్ డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో ఉన్న నిఖిల్, గౌరవ్‌లు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని సమాచారం. ఈ ట్విస్ట్‌తో బిగ్‌బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Key Points
బిగ్‌బాస్ సీజన్ 9 పదో వారం విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
దివ్య, గౌరవ్, నిఖిల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం.
నిఖిల్, గౌరవ్‌లు డబుల్ ఎలిమినేషన్‌తో హౌస్ నుంచి బయటకి.
బిగ్‌బాస్ 9: కొనసాగుతున్న పదో వారం
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్9(Bigg Boss Season 9) సక్సెస్‌ఫుల్‌గా అన్ని సీజన్లకు విభిన్నంగా కొనసాగుతోంది. ఇక ఇందులో పదో వారం కొనసాగుతుండగా.. మరో నాలుగు వారాలకు గ్రాండ్ ఫినాలేకు చేరుకోనుంది. ప్రస్తుతం 11మంది హౌస్‌మెట్స్ ఉండగా.. రోజు రోజుకు తమ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. అలాగే ఎలిమినేట్ అవకుండా సేఫ్ అవుతున్నారు. గత వారం రాము సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. సాయి శ్రీనివాస్ తక్కువ ఓట్లు వచ్చినందున హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది ఉన్నారు. తనూజ, డిమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, భరణి, గౌరవ్, నిఖిల్, కళ్యాణ్,దివ్య నామినేట్ అయ్యారు.
ఇమాన్యుయేల్ కెప్టెన్ కావడంతో సీక్రెట్‌గా నామినేట్ చేయమని బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ హౌస్‌మెట్స్ చేయకపోవడంతో ఎప్పటిలాగే ఈ వారం సేఫ్ అయ్యాడు. అయితే ఇందులో తనూజ, పవన్, సుమన్ శెట్టి ఓటింగ్ పరంగా ముందున్నట్లు సమాచారం. ఆ తర్వాత రీతూ, భరణి, సంజన ఉండగా.. దివ్య(divya), గౌరవ్(Gaurav), నిఖిల్ (Nikhil)డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో గేమ్ పరంగా చూసుకుంటే దివ్య అన్ని టాస్కుల్లో బాగా ఆడినందున ఈ వారం నిఖిల్, గౌరవ్‌లను డబుల్ ఎలిమినేషన్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు జగరబోయే ఎపిసోడ్‌లో అందరికీ వీరి ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ ట్వీస్ట్ ఇవ్వబోతున్నాడట.
ఈ వారం నామినేషన్స్, ఓటింగ్ అప్‌డేట్స్
డబుల్ ఎలిమినేషన్: బయటకు వెళ్తున్నది ఎవరు?
మొత్తానికి ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ డబుల్ ఎలిమినేషన్‌తో పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. నిఖిల్, గౌరవ్‌ల నిష్క్రమణతో ఆట మరింత ఉత్కంఠగా మారనుంది. మిగిలిన కంటెస్టెంట్స్ గేమ్ ఎలా మారుతుందో వేచి చూడాలి.


