|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్-9: షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ అవుట్!

Published: 11-10-2025, 12:18 PM
బిగ్‌బాస్-9: షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ అవుట్!

బిగ్‌బాస్-9 ఐదో వారంలో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ఈసారి డబుల్ ఎలిమినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. వారి నిష్క్రమణ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. త్వరలో కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం.

Key Points

1

బిగ్‌బాస్-9 ఐదో వారం ఆసక్తికరంగా కొనసాగుతోంది.

2

తక్కువ ఓట్లతో ఫ్లోరా షైనీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

4

ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ప్రేక్షకులందరినీ షాక్‌కి గురిచేసింది.

షాకింగ్ డబుల్ ఎలిమినేషన్

బిగ్‌బాస్-9(Bigg Boss-9) రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. సెలబ్రిటీలు, వర్సెస్ కామనర్స్ పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 15 మంది ఇంట్లోకి వెళ్లగా.. అనూహ్యంగా.. ఒక్కో వారానికి ఒక్కొక్కరి చొప్పున ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తున్నారు. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా.. ఆ తర్వాత మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్ ఇంట్లోంచి వచ్చేశారు. ఈక్రమంలోనే.. దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఐదో వారం పూర్తి కావొస్తుండగా.. ఈ సారి రామ్ రాథోడ్, ఇమాన్యుయేల్, సేఫ్ జోన్‌లో ఉండగా.. దమ్ము శ్రీజ, తనూజ, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజనా, ఫ్లోరా, సుమన్ శెట్టి, భరణి, దివ్య నామినేట్ అయి డేంజర్‌లో ఉన్నారు.

ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో ఫ్లోరా షైనీ(Flora Shiny) ఓట్లు తక్కువ పడటంతో ఇంట్లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కామనర్స్ కేటగిరీలో అగ్నిపరీక్ష ఎదుర్కొని హౌస్‌లోకి వచ్చిన దమ్ము శ్రీజ(dammu sreeja) కూడా బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందరికీ దీటుగా పోటీ ఇచ్చినప్పటికీ ఆట మీద కాకుండా ఇతర పంచాయతీల మీ దృష్టి పెట్టడంతో నెగెటివిటీ ఎక్కవై ఓట్లు తక్కువగా వచ్చినట్లు టాక్. ఈ సారి డబుల్ ఎలిమినేషన్స్‌లో ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. ఇక ఆరు వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

హౌస్ నుంచి బయటికొచ్చిన కంటెస్టెంట్స్

రానున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు?

మొత్తానికి ఐదో వారం బిగ్‌బాస్-9లో డబుల్ ఎలిమినేషన్స్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాయి. ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ బయటకు రావడంతో, త్వరలో రానున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరింత ఉత్కంఠను పెంచేలా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.