|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్యూట్ మూమెంట్.. తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్.. తనూజ ఏమందో తెలుసా?

Published: 09-10-2025, 3:50 AM
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్యూట్ మూమెంట్.. తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్.. తనూజ ఏమందో తెలుసా?

బిగ్ బాస్ 9 తెలుగు హౌస్‌లో ఓ అందమైన ప్రేమకథ మొదలైంది. కళ్యాణ్ తన మనసులో మాటను తనూజకు ప్రపోజల్ రూపంలో చెప్పాడు. అయితే, తనూజ స్పందన కళ్యాణ్‌ని షాక్‌కి గురిచేసింది. ఈ క్యూట్ మూమెంట్ హౌస్‌లో, ప్రేక్షకులలో చర్చకు దారితీసింది.

Key Points

1

కళ్యాణ్ సీజన్ 9 మొదలైనప్పటి నుంచి తనూజపై ప్రేమను పెంచుకున్నాడు.

2

బుధవారం నాటి ఎపిసోడ్‌లో తనూజకు ఎమోషనల్‌గా ప్రపోజ్ చేశాడు.

4

కళ్యాణ్ ప్రపోజల్ సీన్ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.

కళ్యాణ్ మనసులో మాట

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్ని ఎమోషన్స్ కలయిక. అందులో ప్రేమ అనే అందమైన ఎమోషన్ కూడా ఒకటి. ప్రతీ సీజన్ లో ఎదో ఒక జంట ఆ ఫీలింగ్ ని ఫీలవడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అలాంటి ఎమోషన్ ఇద్దరి మధ్య క్రియేట్ అయ్యింది. ఆ ఇద్దరు మరెవరో కాదు తనూజ-పవన్ కళ్యాణ్. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి కళ్యాణ్ తనూజపై ప్రత్యేకమైన ఎమోషన్ ని చూపిస్తూనే ఉన్నాడు(Bigg Boss 9 Telugu). వీలున్నప్పుడు ఆ ఫీలింగ్ చెప్పడానికి కూడా ట్రై చేశాడు. ఆ విషయం హౌస్ లో ఉన్నవారికి మాత్రమే కాదు చూస్తున్న షో చూస్తున్న ప్రేక్షకులకు కూడా క్లియర్ గా అర్థమయ్యింది.

Harshavardhan Rameshwar: యానిమల్ ఎఫెక్ట్.. మ్యూజిక్ డైరెక్టర్ దశ తిరిగిపోయింది.. త్రివిక్రమ్, పూరి సినిమాలు సెట్టు

తనూజ రియాక్షన్ ఏంటి?

ఆ విషయం తనూజకి కూడా అర్థం అయ్యింది. కానీ, ఎక్కడ కూడా ఆమె ఓపెన్ అవలేదు. సింపుల్ గా అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇమ్మాన్యుయేల్ తో సరదాగా ఉంటూ వచ్చింది. అయితే, తనూజపై ఉన్న ఫీలింగ్స్ ని ఆపుకోలేకపోయిన పవన్ ఓపెన్ అయిపోయాడు. తన ఫీలింగ్ ఓపెన్ గానే తనూజ ముందు ఎక్సప్రెస్ చేశాడు. బుధవారం నాటి ఎపిసోడ్ లో ఈ క్యూట్ మూమెంట్ జరిగింది. టాస్క్ లో భాగంగా కాసేపు తనూజతో డిస్కషన్ పెట్టిన పవన్.. “ఏదైనా ఛాన్స్ ఉందా. నాలాంటివాడు అయితే నీకు ఓకేనా? అంటూ చాలా ఎమోషనల్ గా ప్రపోజ్ చేశాడు.

ఎపిసోడ్ హైలైట్ అదే!

దానికి తనూజ స్పందిస్తూ.. “ఇందుకే నిన్ను పిల్లాడు అనేది అంటూ నవ్వింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌, కామ్‌గా డీల్ చేసేవాడు. ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో ఆ టాపిక్‌ని తెగ్గొట్టే సత్తా, అన్నింటికన్నా నా మైండ్ సెట్‌కి మ్యాచ్ అయ్యే వ్యక్తిని నేను ఇష్టపడతాను” అంటూ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది తనూజ. దాంతో, విషయం అర్థమైన కల్యాణ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఈ క్యూట్ మూమెంట్ ని పక్కనే ఉండి చూస్తున్న రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్ కౌంటర్స్ వేస్తూ నవ్వుకున్నారు. అలా తనూజ-కళ్యాణ్ మధ్య జరిగిన ఈ ప్రపోజల్ సీన్ ఎపిసోడ్ కి హైలెట్ గా నిలిచింది.

కళ్యాణ్, తనూజ మధ్య జరిగిన ఈ ప్రపోజల్ బిగ్ బాస్ 9 ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. తనూజ స్పందన కళ్యాణ్‌కు నిరాశ కలిగించినా, వారి మధ్య స్నేహబంధం ఎలా కొనసాగుతుందో చూడాలి. ఇది హౌస్‌లో కొత్త చర్చకు తెరలేపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.