
బిగ్ బాస్ 9 తెలుగు నుండి ఈ వారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆరోగ్య సమస్యలతో పాటు హౌస్‌మేట్స్ నుంచి వ్యక్తమైన బలమైన నెగిటివిటీ అతడి ఎలిమినేషన్‌కు కారణమని తెలుస్తోంది. ఈ షాకింగ్ పరిణామం వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.
Key Points
బిగ్ బాస్ 9 తెలుగు నుండి మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్.
ఆరోగ్య సమస్యల వల్ల హరీశ్ గేమ్స్ ఆడలేకపోవడం ప్రధాన కారణం.
హౌస్‌మేట్స్ నుండి హరీశ్‌పై బలమైన నెగిటివిటీ వ్యక్తమైంది.
నాగార్జున అడిగినప్పుడు చాలామంది హౌస్‌మేట్స్ హరీశ్ పేరు చెప్పారు.
హరీశ్ ఎలిమినేషన్: అసలేమైంది?
ఈసారి షాకింగ్ ఎలిమినేషన్. గత వారం ప్రియ బయటకెళ్లిపోయింది. కానీ ఆమెతో పాటు చివరవరకు డేంజర్ జోన్‌లో ఉన్న కల్యాణ్ లిస్టులో లేడు. దీంతో ప్రియ దోస్త్ శ్రీజ.. ఈసారి ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్స్ వల్ల ఈ వారం చాలా లెక్కలు మారిపోయాయి. అయినా సరే మరో కామనర్ ఎలిమినేట్ అయిపోయాడు. అతడే మాస్క్ మ్యాన్ హరీశ్. ఇంతకీ అసలేమైంది?
అగ్నిపరీక్ష పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చిన హరీశ్.. హౌసులోకి అడుగుపెట్టాడు. అయితే వచ్చినప్పటి నుంచి నాకు నచ్చినట్లు నేనుంటాను. పక్కనోళ్లు కూడ నాకు నచ్చినట్లుగానే ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నోరుజారడం, వాటి గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం కామన్ అయిపోయింది. కానీ ఈ వారం మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల గేమ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఓటింగ్ అంతా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య సమస్యలు, నెగిటివిటీ: కారణాలివే!
ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. సంజన, రీతూ, శ్రీజ, ఫ్లోరా, దివ్య, హరీశ్. వీళ్లలో సంజన, రీతూ, ఫ్లోరా.. తొలి వారం నుంచి అడపాదడపా నామినేషన్లలో ఉంటూ వచ్చారు. దీంతో వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఏర్పడింది. అలా ఈసారి కూడా ఓటింగ్ బాగానే పడింది. దివ్య కూడా వచ్చి వారమే అవుతుండటం, హౌసులో హుందాగా ప్రవర్తిస్తుండటం ఈమెకు ప్లస్ అవుతోంది. అది ఓట్ల రూపంలో మారుతోంది. చివరగా ఈసారి శ్రీజ కూడా కల్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీంతో ఈమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. అమ్మాయిలందరూ ఆకట్టుకుంటే హరీశ్ మాత్రం ఆరోగ్య సమస్యలతో గేమ్స్ ఆడలేకపోయారు. అలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
హౌస్‌మేట్స్ అభిప్రాయం, ఓటింగ్ సరళి
ఆరోగ్య సమస్యనే మెయిన్ అయినప్పటికీ హరీశ్‌పై హౌసులోనూ నెగిటివిటీ బాగానే ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఫ్లోరా-హరీశ్ ఫొటోల్లో ఒకరిది ఎంచుకుని ట్రాష్ చేయాలని నాగార్జున అడిగేసరికి చాలామంది హౌస్‌మేట్స్ హరీశ్ పేరు చెప్పారు. అలా ఈసారి హౌస్ నుంచి మాస్క్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేసేశారట. అనధికారికంగా ఈ విషయం బయటకొచ్చింది. ఆదివారం ఎపిసోడ్‌తో హరీశ్ ఎలిమినేషన్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
ఆరోగ్య సమస్యలు, కంటెస్టెంట్స్ నుండి వ్యతిరేకత కారణంగా మాస్క్ మ్యాన్ హరీశ్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఈ ఎలిమినేషన్‌పై పూర్తి స్పష్టత రానుంది.


