
📌 Key Points
- బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలే డిసెంబర్ 21న గ్రాండ్ గా జరగనుంది.
- విన్నర్ కి రూ.50 లక్షల భారీ ప్రైజ్ మనీ లభించనుంది.
- లగ్జరీ కారు, విలువైన నక్లెస్ వంటి కళ్ళు చెదిరే గిఫ్టులు కూడా గెలుచుకోబోతున్నారు.
- మొత్తం బహుమతుల విలువ దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుందని అంచనా.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు, ఎంత ప్రైజ్ మనీ, కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకోనున్నారు అనే వివరాలపై ఆసక్తి నెలకొంది. గత సీజన్ల కంటే భారీగా ఉండనున్న బహుమతుల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్రాండ్ ఫినాలే ఎప్పుడంటే?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 7న తేదీన గ్రాండ్ గా మొదలైన ఈ సీజన్ డిసెంబర్ 21న జరిగే గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కానుంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను కూడా గతంలో ఎన్నడూ లేనంత గ్రాండ్ గా సెట్ చేస్తున్నారట మేకర్స్. గతవారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ సుమన్ శెట్టి, భరణీలను ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు. ఇక ప్రస్తుతం ఈ సీజన్ కి సంబందించిన టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. వారిలో తనూజ, సంజనా, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
Preethi Mukundan: గ్లామర్ తో మతిపోగొడుతున్న ప్రీతి ముకుందన్.. ఫొటోలు
విన్నర్ అందుకోబోయే ప్రైజ్ మనీ వివరాలు
వీరిలో ఈ సీజన్ కి ఎవరు విన్నర్ అవుతారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అలాగే, విన్నర్ అందుకోబోయే ప్రైజ్ మనీ ఎంత, మనీతోపాటు ఇంకా ఏమేం గిఫ్టులు అందుకున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9 Telugu) కి సంబందించిన ప్రైజ్ మనీ ఎంత అనేది గత వారమే చెప్పేశారు. దాని ప్రకారం ఈ సీజన్ విన్నర్ ఏకంగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోబోతున్నారు.
టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే!
కేవలం, ప్రైజ్ మనీ మాత్రమే కాదు, కళ్ళు చెదిరే గిఫ్టులను కూడా ఈ సీజన్ విన్నర్ అందుకోబోతున్నాడు. గతంలో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా, ప్రముఖ నగల సంస్థ నుంచి లక్షల విలువ చేసే నక్లెస్ ను అందించనున్నారట. అలాగే ప్రముఖ సంస్థ ఖరీదైన కారును కూడా విన్నర్ కి అందించనున్నారు అని తెలుస్తోంది. రూ.50 లక్షల ప్రైజ్ మనీ, నక్లెస్, ఖరీదైన కారు కలిపి దాదాపు రూ.80 లక్షల వరకు గెలుచుకోబోతున్నారట ఈ సీజన్ విన్నర్. అయితే, ఈ ప్రైజ్ మనీలో చాలా వరకు టాక్సుల కింద కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా చూసుకున్నా ఈ సీజన్ విన్నర్ కి మాత్రం అదిరిపోయే రేంజ్ లో మనీ, గిఫ్టులు అందనున్నాయి. మరి ఆ అదృష్టం ఎవరికీ వరిస్తుంది అనేది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అందుకోబోయే భారీ ప్రైజ్ మనీ, లగ్జరీ గిఫ్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్ 21న జరిగే గ్రాండ్ ఫినాలేలో ఎవరు ఆ అదృష్టవంతుడో తెలియాలంటే, వేచి చూడాల్సిందే.


