|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

42 ఏళ్లకే బిగ్‌బాస్ న‌టి షెఫాలి జరివాలా మృతి.. ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్.. డెత్ మిస్టరీ ఏమైనా ఉందా? పోలీసులు ఏం చెప్పారు?

Published: 28-06-2025, 5:45 AM
42 ఏళ్లకే బిగ్‌బాస్ న‌టి షెఫాలి జరివాలా మృతి.. ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్.. డెత్ మిస్టరీ ఏమైనా ఉందా? పోలీసులు ఏం చెప్పారు?

ప్రముఖ బిగ్ బాస్ నటి షెఫాలి జరివాలా 42 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆమె మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ కూడా ఆమె ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరిస్తోంది.

Key Points

1

42 ఏళ్ల బిగ్ బాస్ నటి షెఫాలి జరివాలా మృతి.

2

గుండెపోటుతో మరణించినట్లు సమాచారం, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

4

మరణానికి గల కారణం తెలియాలంటే శవపరీక్ష నివేదిక కోసం ఎదురు చూడాల్సి ఉంది.

షెఫాలి జరివాలా అకాల మరణం

నటి షెఫాలి జరివాలా మరణం బాలీవుడ్ సినీ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 42 ఏళ్ల ఆమె శుక్రవారం రాత్రి మరణించారు. మరణానికి అధికారిక కారణం ప్రకటించనప్పటికీ, కొన్ని నివేదికలు అది గుండెపోటు అని పేర్కొన్నాయి. మరణం సహజ కారణాల వల్ల జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, ముంబయి పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

శుక్రవారం (జూన్ 27) రాత్రి.. షెఫాలి జరివాలా తన అంధేరీ ఇంట్లో మరణించినట్లు సమాచారం. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ముంబయి పోలీసులు శుక్రవారం రాత్రి ఆమె మరణాన్ని ధృవీకరించారు కానీ ఇప్పటివరకు మరణానికి గల కారణాన్ని వెల్లడించలేదు. శనివారం ఉదయం శవపరీక్ష కోసం షెఫాలి మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

షెఫాలి జరివాలా గుండెపోటుతో మరణించారనే వార్తలు వస్తున్నాయి. అయినా దీనిపై పోలీసుల ఎంక్వైరీ మొదలెట్టారు. ఆమె ఏ కారణంతో మరణించదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ముంబయి పోలీసుల మెడికల్, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు కోసం షెఫాలి ఇంటికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి, వారు దీనిని సాధారణ దర్యాప్తుగా పరిగణిస్తున్నారని పోలీసు వర్గాలు హిందూస్థాన్ టైమ్స్ కి తెలిపాయి. ఎందుకంటే శవపరీక్ష నిర్వహించే వరకు మరణానికి గల కారణాన్ని ప్రకటించలేరు.

షెఫాలి జరివాలా మరణంపై ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ పోలీసులు మాత్రం తమ విచారణ నిర్వహిస్తున్నారు. ఇది సహజ మరణమేనా? ఏమైనా మిస్టరీ దాగి ఉందా? అని కనిపెట్టేందుకు రంగంలోకి దిగారు. దీన్ని ధృవీకరించడానికి ఫోరెన్సిక్స్ బృందం షెఫాలి, పరాగ్ అంధేరీ ఇంట్లో ఆధారాలు సేకరిస్తోంది. వారు నటి ఇంటి సిబ్బందిని, ఆమె వంటమనిషిని కూడా ప్రశ్నించారు.

ఫోరెన్సిక్ టీమ్ విచారణ

షెఫాలి కుటుంబం, స్నేహితులు శనివారం ఉదయం అంతా కూపర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆమె మరణించిన పరిస్థితులకు సంబంధించి పరాగ్ లేదా కుటుంబ సభ్యులు ఎవరూ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

షెఫాలి జరివాలా తన మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’ విజయంతో 2002లో రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఆమె తరువాతి రెండు దశాబ్దాలుగా సినిమాలు, టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. హిందీ రియాలిటీ షోలో బిగ్ బాస్ లోనూ పార్టిసిపేట్ చేసింది. పరాగ్, షెఫాలి 2014లో వివాహం చేసుకున్నారు. షెఫాలి మరణంతో పరాగ్ తీవ్రమైన బాధలో మునిగిపోయారు.

షెఫాలి జరివాలా మృతితో సినీ ప్రేక్షకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసుల దర్యాప్తు, శవపరీక్ష నివేదిక తర్వాతే మరణానికి నిజ కారణం తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.