
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘సుమతీ శతకం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అమర్ దీప్ మెడలో కూరగాయల దండతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
బిగ్ బాస్ అమర్ దీప్ 'సుమతీ శతకం' లో హీరోగా నటిస్తున్నారు.
అమర్ దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
సుమతీ శతకం చిత్రం షూటింగ్ పూర్తయింది.
దసరాకు సినిమా విడుదల కానుంది.
అమర్ దీప్ ఫస్ట్ లుక్
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సుమతీ శతకం. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న సుమతీ శతకం సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు.
సుమతీ శతకం సినిమాకు ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అమర్ దీప్ చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్ట్ 16 సుమతీ శతకం నుంచి హీరో పాత్రగా అమర్ దీప్‌ను పరిచయం చేశారు. ఈ సినిమాల అమర్ దీప్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇక సుమతీ శతకంలోని అమర్ దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అర్థం అవుతోంంది.
సుమతీ శతకం విడుదల తేదీ
అమర్ దీప్ మెడలో కూరగాయలతో అల్లిన దండలు, ఆ బ్యాక్ గ్రౌండ్ వాతావరణం, ఆయన క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే సుమతీ శతకం టీజర్, ట్రైలర్‌ను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు దర్శకనిర్మాతలు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సుమతీ శతకం విడుదల తేదీని ప్రకటించాలని మేకర్లు భావిస్తున్నారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ అహర్నిశలు కష్టపడుతోంది. కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ పని చేశారు.
సినిమా విశేషాలు
అలాగే, డైలాగ్స్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్, ఆర్ట్ డైరెక్టర్ గా విశ్వ ప్రసాద్, కెమెరామెన్‌గా హాలేష్ పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అమర్ దీప్ చౌదరి. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన అమర్ దీప్ ఎంతోమందిని అలరించారు.
అమర్ దీప్ చౌదరి బిగ్ బాస్ కంటే ముందు బుల్లితెర సీరియల్‌తో చాలా పాపులర్ అయ్యారు. జానకి కలగనలేదు అనే సీరియల్‌తో అమితమైన అభిమానులను సంపాదించుకున్నారు అమర్ దీప్ చౌదరి. ఇప్పుడు సినిమాల్లో హీరోగా అలరించేందుకు రెడీ అయ్యారు.
సుమతీ శతకం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా విడుదల చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అమర్ దీప్ హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.


