
📌 Key Points
- బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్, శైలి జంటగా ‘సుమతీ శతకం’ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
- ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది.
- ‘సుమతీ శతకం’ సినిమా ద్వారా అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా కనిపించనున్నారు.
- ఈ చిత్రానికి కొమ్మలపాటి శ్రీధర్ సమర్పకులుగా, ఎం ఎం నాయుడు దర్శకత్వం వహించారు.
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 6న ‘సుమతీ శతకం’ విడుదల
Sumathi Sathakam release: బుల్లితెర నటుడిగా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary) బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈయన రన్నర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం అమర్ బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉంటూ సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే అమర్ దీప్, శైలి (Shaili)జంటగా నటించిన చిత్రం సుమతీ శతకం (Sumathi Sathakam). కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో ఎం ఎం నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నా కుట్టి కుట్టి సుమతి అంటూ సాగిపోయే పాటను కూడా విడుదల చేయగా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారికంగా తెలియజేశారు.
సుమతీ శతకం సినిమాని ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారకంగా వెల్లడిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటివరకు బుల్లితెర కార్యక్రమాలు బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . మరి ఈయన హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది? హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ చేతికి పంపిణీ హక్కులు
Get ready for a wholesome theatrical treat 🥳 #SumathiSathakam Grand Release across Telugu States on Feb 6th through @mythrirelease 🔥 #SumathiSathakamonFeb6 @Actor_amardeep #Saylimchaudhri @thejdvprasad #NayuduMediseti @Tastyteja1 @kommalapatisai @NahidCuts @mks131119 … pic.twitter.com/FF9tjqrc5j
— Mythri Movie Distributors LLP (@MythriRelease) January 26, 2026
వెండితెరపై హీరోగా అమర్ దీప్
ఇక ఈ సినిమాలో అమర్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సుమతీ శతకం అనే టైటిల్ పెట్టడంతో కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఇందులో హీరోయిన్ సుమతి అనే పాత్రలో నటించబోతున్నారని, ఆమె ఒక అంగన్వాడీ టీచర్ గా కనిపించబోతున్నట్లు స్వయంగా అమర్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇక అమర్ పెళ్లి చేసుకోవాలనే ఆసక్తితో దాదాపు 99 మంది అమ్మాయిలను చూడగా వారందరూ రిజెక్ట్ చేస్తారు ఇక సుమతి అనే అమ్మాయి 100వ అమ్మాయి కావడంతో ఈ సినిమాకు సుమతీ శతకం అనే టైటిల్ పెట్టినట్లు టైటిల్ వెనుక స్టోరీని మొత్తం లీక్ చేశారు. ఇక ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
అమర్ దీప్ బుల్లితెరపై తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ‘సుమతీ శతకం’ సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్నారు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


