|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సొంతూరి జాతరలో.. ఆ మూలాల బంధం!

Published: 26-05-2026, 6:45 AM
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సొంతూరి జాతరలో.. ఆ మూలాల బంధం!
  • DSP ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ వీడియో గ్రామీణ జానపద సంస్కృతిని ఆవిష్కరించింది.
  • తూర్పు గోదావరి జిల్లా వెదురుపాక తన తండ్రి సత్యమూర్తి జన్మస్థలమని DSP తెలిపారు.
  • చిన్ననాటి జ్ఞాపకాలు, జాతర వాతావరణం తన సంగీతానికి ప్రేరణ అని DSP పేర్కొన్నారు.
  • DSP స్వయంగా డప్పులు కొడుతూ, స్టెప్పులు వేస్తూ జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన మూలాలను వెతుక్కుంటూ సొంత ఊరి జాతరకు వెళ్లారు. ఆయన సమర్పణలో వచ్చిన ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ వీడియో గ్రామీణ సంస్కృతిని, జాతర వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. తన తండ్రి జన్మస్థలమైన వెదురుపాకతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

DSP ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ

Yellamma Video: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించడమే కాకుండా, మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన “Yellamma” (ఎల్లమ్మ) అనే ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ అండ్ కల్చరల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది. మన గ్రామీణ జానపద సంస్కృతిని, జాతర వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ వీడియో విశేషాలు మీకోసం…

Read also- హీరో ఉపేంద్ర ఇంట సంబరాలు.. కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..

ఈ వీడియో ఆరంభంలో దేవి శ్రీ ప్రసాద్ తన మూలాలను గుర్తుచేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని ‘వెదురుపాక’ గ్రామం తన తండ్రి (ప్రముఖ రచయిత సత్యమూర్తి) జన్మస్థలమని తెలిపారు. చిన్నప్పుడు చెన్నై వంటి నగరాల్లో పెరిగినప్పటికీ, ప్రకృతి స్వచ్ఛతను శ్వాసించడానికి, పల్లెటూరి అందాలను ఆస్వాదించడానికి తమ తండ్రి తరచూ వెదురుపాక తీసుకువచ్చేవారని గుర్తుచేసుకున్నారు. తమ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు DSP పంచుకున్నారు.

మూలాలను గుర్తుచేసుకున్న రాక్ స్టార్

వెదురుపాక గ్రామ సంస్కృతి, అక్కడి జానపద కళలు, దైవత్వంతో కూడిన జాతర వాతావరణం చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో ప్రేరేపించాయని DSP చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్‌తోనే ‘ఎల్లమ్మ జాతర’ కాన్సెప్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు అందించడానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఈ వీడియోలో వెదురుపాక లోని ప్రసిద్ధ ‘శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం’ మరియు ‘శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం’లకు సంబంధించిన విజువల్స్, అక్కడ DSP ప్రత్యేక పూజలు నిర్వహించడం చూడవచ్చు.

ఈ వీడియోలో పల్లెటూరి జాతర వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. స్థానిక జానపద కళాకారులు వేసిన కాళికా మాత, ఎల్లమ్మ రూపాలు, శివసత్తుల పూనకాలు, సాంప్రదాయ పులి వేషాలు, డప్పు వాయిద్యాల గంభీరమైన ధ్వనులు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. కేవలం మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా, DSP స్వయంగా ఊరి ప్రజలతో కలిసి ఎంతో ఉత్సాహంగా డప్పులు కొడుతూ, స్టెప్పులు వేస్తూ జాతర హంగామాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లారు.

Read also- అమీర్ ఖాన్ చిత్రంలో పాకిస్తానీ క్రికెటర్‌గా ఫర్హాన్ అక్తర్!.. ‘డాన్ 3’ వివాదం ముగియకముందే..

వెదురుపాక జాతరలో DSP సందడి

తనలో సంగీత బీజాలు నాటిన తన తండ్రి సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తరతరాలుగా భారతీయ జానపద కళలను, సంస్కృతిని తమ భుజాలపై మోస్తూ బ్రతికిస్తున్న ప్రపంచవ్యాప్త జానపద కళాకారులందరికీ ఈ వీడియో ద్వారా దేవి శ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ చిత్ర బృందం అంకితమిచ్చింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, ‘బలగం చిత్ర దర్శకుడు వేణు యెల్దండి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ ‘Yellamma’ మ్యూజికల్ ఆల్బమ్ తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రూట్ లెవెల్ కంటెంట్‌తో వస్తున్న ఈ వీడియో సౌత్ ఆడియన్స్‌తో పాటు నార్త్ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో పాటు, సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ, వాటిని ప్రపంచానికి పరిచయం చేయడంలో చూపిన నిబద్ధత ప్రశంసనీయం. ‘ఎల్లమ్మ’ వీడియో మన సంస్కృతికి ఒక గొప్ప నివాళి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.