
📌 Key Points
- బిగ్ బాస్ అంబటి అర్జున్ నటించిన ‘పరమపద సోపానం’ మూవీ ఏప్రిల్ 24న విడుదల!
- పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్!
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కీలక పాత్రలో అర్జున్ అంబటి మెరుపులు!
- పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకున్న ‘పరమపద సోపానం’ మూవీ విడుదల తేదీ ఖరారు!
బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన అంబటి అర్జున్ హీరోగా వస్తున్న ‘పరమపద సోపానం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. పూరి జగన్నాథ్ శిష్యుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ పోస్టర్ వైరల్ గా మారింది.
పూరి జగన్నాథ్ శిష్యుడి దర్శకత్వంలో అర్జున్ మూవీ!
Bigg Boss Ambati Arjun Paramapada Sopanam Release Date Poster: బుల్లితెరపై సీరియళ్లు, బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా అంబటి అర్జున్ నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పరమపద సోపానం. పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ అలరిస్తోంది.
Bigg Boss Ambati Arjun Paramapada Sopanam: ‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అర్జున్ అంబటి.
రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్రలో అంబటి అర్జున్!
ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు, ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ శివ.
పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకున్న పరమపద సోపానం చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా చిత్ర బృందం పరమపద సోపానం పోస్టర్‌ను వదిలారు. ఇందులో హీరో అర్జున్ అంబటి లుక్ ఇంటెన్స్ ఫీల్ కలిగిస్తుంది.
‘పరమపద సోపానం’ మూవీ విడుదల ఎప్పుడో తెలుసా?
ఇదిలా ఉంటే, బుల్లితెర పై సీరియల్లలో హీరోగా చేసి తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్న అంబటి అర్జున్ బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి తన పర్ఫామెన్స్, స్ట్రాటజీతో చాలా బాగా ఆకట్టుకున్నాడు. టాప్ 5 వరకు చేరుకున్నాడు.
అంబటి అర్జున్ ‘పరమపద సోపానం’ మూవీ ఏప్రిల్ 24న విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


