|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నాకెప్పుడెమైనా ఎక్కువ బాధ పడే టైం ఇవ్వకుండా తన దగ్గరకి పిలుచుకుంటాడు’.. బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published: 21-06-2025, 7:16 AM
‘నాకెప్పుడెమైనా ఎక్కువ బాధ పడే టైం ఇవ్వకుండా తన దగ్గరకి పిలుచుకుంటాడు’.. బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

బిగ్ బాస్ షో ద్వారా పేరు తెచ్చుకున్న నటి దివి తాజాగా తన సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పంచుకుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆమె పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Key Points

1

బిగ్ బాస్ దివి తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయాన్ని పంచుకుంది.

2

స్వామి ఆమెకు ఎల్లప్పుడూ ఆదుకుంటాడని, బాధల నుండి ఉపశమనం కలిగిస్తున్నాడని ఆమె పేర్కొంది.

4

ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయని, అవి నెరవేరే వరకు చెప్పకూడదని ఆమె పేర్కొంది.

దివి యొక్క తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకుంది యాక్టర్ దివి. బీటెక్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ యాక్టింగ్పై ఇంట్రెస్ట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటిసారిగా టాలీవుడ్ సీనియర్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించింది. అనంతరం ఈ ముద్దుగుమ్మ చిన్నా చితకా పాత్రలతోపాటు పలు కవర్ సాంగ్స్ కూడా స్టెప్పులేసి నెటిజన్లను ఆకట్టుకుంది.

తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం

అంతేకాకుండా ఈ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో అవకాశం కల్పించారు. బిగ్బాస్ సీజర్-4 గ్రాండ్ ఫినాలేకు వచ్చినప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు. ఇక నయీం డైరీస్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి.. ప్రేక్షకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 లో దివి రిపోర్టర్‌గా కనిపించింది. ఇకపోతే తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకుంది. ఈ బ్యూటీ తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

నటిగా ఆమె ప్రయాణం

ఇందుకు సంబంధించిన ఫొటోను పంచుకుని.. ‘‘ప్రపంచంలో ఉండటానికి ఉత్తమమైన ప్రదేశం ఇది. నాకెప్పుడు ఈ బాధ ఒచ్చినా ఎక్కువ బాధ పడే టైం ఇవ్వకుండా తానా దగ్గరకి పిలుచుకుంటాడు శ్రీ వేంకటేశ్వర స్వామి. స్వామిని చూసిన వెంటనే అన్నీ బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయి. నేను నటిని అయినప్పటి నుండి, ఇప్పటి వరకు ప్రతి కోరిక నేను ఇక్కడ తిరుపతి లో కోరుకున్నాను. స్వామికి ఎప్పటికీ కృతజ్ఞతలు. ఇంకొన్ని కోరికలు ఉన్నాయి.. జరిగే వరకు కోరికలు ఎవరికి చెప్పకూడదు అంటారు’’ అని రాసుకొచ్చింది. instagram link

తిరుమల వెంకటేశ్వర స్వామి దివికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు ఈ పోస్ట్‌లో స్పష్టమవుతోంది. ఆమె భక్తి, ఆమె జీవితంలో స్వామి ప్రభావం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.