|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ హౌస్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

Published: 04-11-2025, 10:17 AM
బిగ్ బాస్ హౌస్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ హౌస్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తమిళ బిగ్ బాస్ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్స్ కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య తీవ్ర ఘర్షణ కనిపించింది. ఈ వైరల్ ప్రోమో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందో నేటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

Key Points

1

తమిళ బిగ్ బాస్ కొత్త ప్రోమో విడుదలైంది.

2

కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

4

ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అసలు విషయం తెలుస్తుంది.

బిగ్ బాస్ హౌస్‌లో తీవ్ర ఘర్షణ

ఏం జరిగిందో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. నేడు ప్రసారం కానున్న తమిళ బిగ్ బాస్ షో ప్రోమో విడుదల అయింది. అందులో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనం రేపుతోంది. కమరుద్దీన్ కోపంతో ప్రవీణ్ రాజ్ మీదికి దూసుకు వెళ్ళాడు. హౌసులో సభ్యులు ఎంత ఆపుతున్నా వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

గొడవ మధ్యలో వెళ్లిన ఇతర కంటెస్టెంట్స్ ను పక్కకి నెట్టి మరీ కొట్టుకోవడం సెన్సేషనల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్లో వైరల్ అవుతోంది. ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా? WWE అనుకుంటున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈరోజు ప్రసారం కానున్న షోలో తెలియనుంది.

వైరల్ అవుతున్న ప్రోమో, నెటిజన్ల కామెంట్స్

నేటి ఎపిసోడ్‌లో అసలు నిజాలు

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ గొడవ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య జరిగిన ఈ పోరాటానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి ఎపిసోడ్ ఈ సస్పెన్స్‌కు తెరదిననుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.