
📌 Key Points
- బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభం, అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం!
- తొలి వీడియోలో తన జీవిత అనుభవాలు, సరదా క్షణాలు పంచుకోనున్న కళ్యాణ్ పడాల.
- ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చానని కృతజ్ఞతలు తెలిపిన బిగ్‌బాస్ విన్నర్.
- త్వరలో మరిన్ని అప్‌డేట్‌లు అందిస్తానని హామీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.
బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల మరో సంచలనానికి తెరలేపారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి!
యూట్యూబ్‌లో కళ్యాణ్ పడాల సందడి
ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల(Kalyan Padala) సామాన్యుడిగా రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss-9) లో పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. సీజన్-9లో పాల్గొని ముందుగా టాస్కుల్లో పెద్దగా యాక్టివ్‌గా లేనప్పటికీ చివరి వారాల్లో తన ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా మొదటి ఫైనలిస్ట్‌గా మారి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇక ఈక్రమంలోనే తనూజతో క్లోజ్‌గా ఉండి.. తమ బంధాన్ని అంతా ప్రేమగా అనుకునేలా ప్రవర్తించాడు. అయితే ముందు నుంచి అన్ని టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండి ఆడపులిలా ఆడిన తనూజ గెలుస్తుందనుకుంటే.. ఊహించని విధంగా కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచాడు. తొలిసారి ఒక సామాన్యుడు గెలిచి చరిత్ర సృష్టించడమే కాక భారీగా ప్రైజ్‌మనీ తీసుకున్నాడు. ఇక బయటకు వచ్చాక ఎంతోమంది కళ్యాణ్ తన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఇక గెలుపును ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ గుడ్ న్యూస్ ప్రకటించాడు.
అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం
తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఓ యూట్యూబ్ చానల్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తనకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీ అందరితో మరింత సన్నిహితంగా కనెక్ట్ అవ్వడానికి, నా నిజమైన వ్యక్తిత్వాన్ని, నేను నేర్చుకున్న విషయాలను, సరదా క్షణాలను, వీటన్నింటి మధ్య జరిగే ప్రతి విషయాన్ని పంచుకోవడానికి నేను నా అధికారిక యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. మీ ప్రేమ నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. ఇప్పుడు నేను ఈ తదుపరి అడుగు వేస్తున్నప్పుడు నాకు మీ మద్దతు అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాతో పాటు ఉండండి.. మనం కలిసి ఎదుగుదాం. మరిన్ని అప్‌డేట్‌లు త్వరలోనే రాబోతున్నాయి’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన కళ్యాణ్ పడాల అభిమానులు కంగ్రాట్స్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
త్వరలో మరిన్ని అప్‌డేట్‌లు
A post shared by Pavan Kalyan Padala (@kalyanpadala881)
కళ్యాణ్ పడాల యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం నిజంగా ఒక శుభవార్త. ఆయన తన జీవితంలోని విశేషాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి.


