|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌ బాస్‌లోకి యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ…

Published: 04-06-2025, 5:21 AM
బిగ్‌ బాస్‌లోకి యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...

బిగ్ బాస్ షో ఇప్పటికే అనేక మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయన్సర్లకు పేరు తెచ్చింది. కానీ, తాజాగా హిందీ బిగ్ బాస్ లో వారికి నో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు తెలుగు బిగ్ బాస్ షోను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.

Key Points

1

బిగ్ బాస్ షోలో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయన్సర్ల ప్రాముఖ్యత పెరుగుతోంది.

2

హిందీ బిగ్ బాస్ షోలో ఈ రకమైన పాల్గొనేవారికి నిషేధం విధించే అవకాశం ఉంది.

4

భవిష్యత్తు బిగ్ బాస్ సీజన్లలో మార్పులు తీసుకురావడానికి ఇది దారితీయవచ్చు.

సోషల్ మీడియా సెలబ్రిటీల ప్రాముఖ్యత

ఎక్కడో ఇంగ్లండ్‌లో పుట్టి ఓ హీరోయిన్‌ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్‌ మూలాలు కలిగిన బిగ్‌బాస్‌(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ  బిగ్‌ బాస్‌.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్‌ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.

డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్‌ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన,  మై విలేజ్‌ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్‌ టాక్‌ వీడియోలతో జూనియర్‌ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్‌స్టా స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్, ఇన్‌స్టా గ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్‌తో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్‌ యూ ట్యూబ్‌ చానెల్‌ ద్వారా ప్రసిద్ధి పొందిన  కిర్రాక్‌ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్‌జె కాజల్,  ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్‌ స్టేటస్‌కు బిగ్‌ బాస్‌ ద్వారా మరింత గ్లామర్‌ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.

ఈ నేపధ్యంలో బిగ్‌ బాస్‌  కొత్త సీజన్‌ ప్రారంభం అవుతోందనగానే సోషల్‌ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్‌ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.

హిందీ బిగ్ బాస్ షోలో మార్పులు

అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి సోషల్‌ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు,  తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్‌ బాస్‌కు సంబంధించినవి కాకపోయినా…  ప్రాంతీయ బిగ్‌బాస్‌లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్‌ బాస్‌ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.

హిందీలో బాలీవుడ్‌ దిగ్గజం సల్మాన్‌ఖాన్‌ సమర్పిస్తున్న బిగ్‌ బాస్‌ 19  గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్‌ కోసం మేకర్స్‌ గణనీయమైన ఫార్మాట్‌ మార్పును ప్లాన్‌ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన,  స్థిరపడిన  బాలీవుడ్‌ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.

తెలుగు బిగ్ బాస్ పై ప్రభావం

టెల్లీ రిపోర్టర్‌ నివేదిక ప్రకారం, బిగ్‌ బాస్‌ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్‌ అప్పీల్‌ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం  నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్‌కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే  ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్‌ బాస్‌ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్లు,  విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్‌ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్‌ మీడియా సెలబ్రిటీల వల్ల  వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్‌ బిగ్‌బాస్‌ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్‌ బాస్‌ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్‌కు కాకపోయినా  వచ్చే సీజన్‌పై సోషల్‌ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు.

హిందీ బిగ్ బాస్ షోలోని ఈ నిర్ణయం తెలుగు బిగ్ బాస్ షోపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే చెప్పాలి. భవిష్యత్తులో సోషల్ మీడియా సెలబ్రిటీలకు బిగ్ బాస్ లో అవకాశాలు తగ్గే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.