|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ రన్నరప్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Published: 13-07-2025, 2:30 AM
పెళ్లి ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ రన్నరప్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పేరు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ తాజాగా తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘సోలో బాయ్’ సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కృష్ణ పెళ్లి ఫొటోను షేర్ చేశాడు.

2

‘సోలో బాయ్’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటో ఇది.

4

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గౌతమ్ కృష్ణ పెళ్లి ఫోటో వైరల్

‘బిగ్ బాస్’(Bigg Boss) రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ మనందరికీ సుపరిచితమే. మొదటి సారి మెయిన్ కంటెస్టెంట్‌గా వెళ్లి అంతగా ఆకట్టుకోలేకపోయాడీ హ్యాండ్సమ్ యాక్టర్. రెండో సారి మాత్రం వైల్డ్ కార్డ్‌తో వెళ్లి వైల్డ్ ఫైర్‌లా విజృంభించాడు. రన్నరప్‌గా నిలిచి తన సత్తాను చూపించాడు. దీంతో సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేశాడు. అలా గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’(soloBoy) అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. నవీన్ కుమార్(Naveen Kumar) తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు.

అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జూలై 4న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ హీరో సోలోబాయ్ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అందులో హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న పిక్ కూడా షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హీరోగా మంచి విజయం సాధించినందుకు గౌతమ్ కృష్ణకు కంగ్రాట్స్ చెబుతున్నారు. Link

సోలో బాయ్ సినిమా షూటింగ్

నెటిజన్ల శుభాకాంక్షలు

గౌతమ్ కృష్ణ సినిమా రంగంలో మంచి విజయం సాధించాలని కోరుకుంటూ నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.