
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో తొమ్మిదవ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో సామాన్యుల ఎంపికకు ‘అగ్నిపరీక్ష’ ఏర్పాటు చేశారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ, ఈ సారి రణరంగం అని ప్రకటించారు.
Key Points
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సారి సామాన్యుల ఎంపిక కోసం 'అగ్నిపరీక్ష' నిర్వహిస్తున్నారు.
నాగార్జున ప్రకారం, ఈ సీజన్ చదరంగం కాదు, రణరంగం.
బిగ్ బాస్ హౌస్‌లో డబుల్ హౌస్, డబుల్ డోస్ ఉండనున్నట్లు సూచనలు.
బిగ్ బాస్ 9: అగ్నిపరీక్ష మరియు కొత్త ట్విస్ట్‌లు
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్ . ఈ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది . ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు . కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు . దాదాపుగా 40 మందిని ఫైనలైజ్ చేసిన వీరికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.
ఈ ప్రాసెస్ నడుస్తుండగానే బిగ్ బాస్ మేకర్స్ మరో ప్రోమోను రిలీజ్ చేశారు . బిగ్ బాస్ కమింగ్ సూన్ అంటూ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్ తో జరిగిన సరదా సంభాషణ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది . బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి వచ్చావా ? అంటూ నాగార్జున అడగ్గా .. కాదు .. ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిశోర్ అంటారు . అది నీవల్ల కాదులే .. ఈసారి వెరీ టఫ్ అని నాగార్జున అనడంతో .. నేను చాలా రఫ్ అని చెప్తాడు .
నాగార్జున ప్రకటన: రణరంగం సిద్ధం!
డబుల్ హౌస్ మరియు డబుల్ డోస్ ఆశ్చర్యం!
ఈ సారీ బిగ్‌బాస్ డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ వెన్నెల కిశోర్‌కు నాగార్జున చిన్న ఝలక్ ఇస్తాడు. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా ? అంటూ వెన్నెల కిషోర్‌ను నాగార్జున ప్రశ్నిస్తాడు . నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటానని వెన్నెల కిశోర్ చెప్పడంతో .. ఈసారీ ఏకంగా బిగ్ బాస్ నే మార్చేశా అంటూ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున . అందరి సరదాలు తీరిపోతాయి .. ఈ సారీ చదరంగం కాదు .. రణరంగమే .. అనే డైలాగ్ లో ప్రోమో ముగిసింది . ఇది చూస్తుంటే ఈ బిగ్ బాస్ సీజన్ లో పాత బిగ్ బాస్ ఉంటాడా ? లేదా నిజంగానే కొత్త బాస్ ను తీసుకొస్తున్నారా ? మొత్తానికి ఈ ప్రోమోతో మరింత ఆసక్తి పెంచేశారు .
బిగ్ బాస్ సీజన్ 9 లో ఎన్నో ట్విస్టులు, టర్న్సు ఉండబోతున్నాయని ప్రోమో సూచిస్తోంది. ఈ సారి చదరంగం కాదు, రణరంగం అంటూ నాగార్జున చెప్పడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.


