|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్.. ఈసారి రణరంగమే.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

Published: 26-06-2025, 2:45 PM
బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్.. ఈసారి రణరంగమే.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

బుల్లితెరలో ప్రేక్షకులను అలరించే బిగ్ బాస్ షో తొమ్మిదవ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. నాగార్జున మళ్ళీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్ లో ఎలాంటి ఉత్కంఠ ఉంటుందో తెలుసుకుందాం.

Key Points

1

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది.

2

నాగార్జున మళ్ళీ హోస్ట్ గా వ్యవహరిస్తారు.

4

బుల్లితెర నటీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొంటారని అంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభ తేదీ

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్.. మళ్లీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్ (Bigg Boss 9) వచ్చేసింది. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని తాజాగా వచ్చిన గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే అని నాగార్జున చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. త్వరలోనే సీజన్ 9 ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.

కాగా.. బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టంట్స్ వీళ్లేనంటూ ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బుల్లితెర నటీనటులు, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు సమాచారం. వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం.. బమ్ చిక్ బబ్లూ, చిట్టీ పికిల్స్ అలేఖ్య చిట్టి, స్నోపాప, కల్పిక గణేష్, యాక్టర్ సాయి కిరణ్, నటి జ్యోతి రాయ్, రీతు చౌదరి, సీరియల్ హీరోశివకుమార్, అనిల్ జీల, కావ్య, ప్రదీప్, బ్రహ్మముడి ఫేమ్ దీపిక, నవ్యస్వామి, ఇమాన్యుయేల్, తేజస్విని గౌడ, హీరో సుమంత్ అశ్విన్, హారిక – ఏక్ నాథ్ తదితరులు సీజన్ 9లో హౌస్ లోకి వెళ్తారని తెలుస్తోంది.

హోస్ట్ నాగార్జున

కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎవరెవరు కంటెస్టెంట్స్ గా ఉన్నారో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ఎంత రొమాంచింగా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.