
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే హౌస్‌లో రచ్చ మొదలైంది. సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య టాస్కుల కారణంగా గొడవలు చెలరేగాయి. ప్రత్యేకంగా మాస్క్ మ్యాన్ గొడవ చర్చనీయాంశమైంది.
Key Points
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్!
మొదటి రోజే హౌస్‌లో మాస్క్ మ్యాన్ గొడవ!
ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి రెడీ అంటూ మాస్క్ మ్యాన్ ప్రకటన!
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ప్రారంభం
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ జరిగింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌తో మొత్తంగా 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు.
వీరిలో కామనర్స్ లగ్జరీ రూమ్స్‌లలో ఓనర్స్‌గా ఉంటే సెలబ్రిటీలు మాత్రం రెంట్ లేకుండా టెనెంట్స్‌లా సాధారణ గదుల్లో ఉండాలని హోస్ట్ నాగార్జున చెప్పారు. ఇక బిగ్ బాస్ తెలుగు 9 మొదటి రోజే హౌజ్‌లో రచ్చ మొదలైంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 8 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
బిగ్ బాస్ ప్రోమోలో ఉదయం పూట హౌజ్‌మేట్స్‌లో జోష్ నింపడానికి డ్యాన్సర్స్ వచ్చి ఎంకరేజ్ చేశారు. వాళ్లతో కంటెస్టెంట్స్ అంతా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం హాల్లో బిగ్ బాస్ హాయ్ చెప్పాడు. దానికి “ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ పడుకున్నప్పుడు కూడా నాకు చెమటలు పట్టడం” అని ఇమ్మాన్యుయెల్ కామెడీ చేశాడు.
మొదటి రోజు టాస్క్‌లో గొడవలు
ఆ తర్వాత హోస్ట్ నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అంతా గార్డెన్‌లో కూర్చున్నారు. ఎవరికి ఏ ఇంటి పని అప్పజెప్పాలో చెప్పే టాస్క్ అది. సెలబ్రిటీలకు కామనర్స్ బ్యాడ్జీలు పెట్టి పనులు అప్పగించారు. హీరోయిన్ ఫ్లోరా సైనికి సోల్జర్ కల్యాణ్ పడాల బాత్రూమ్ పని అప్పజెప్పినట్లు తెలుస్తోంది. “మీరు బాగా చేశారు. అందుకే మీకే ఇస్తున్నాను” అని కల్యాణ్ పడాల అన్నాడు.
“అందరు కలిసి తిన్నవి మాత్రం రీతూ గారు చూస్తారు” అని రీతూ చౌదరి కి డీమన్ పవన్ అప్పజెప్పాడు. “స్టవ్ గురించి చెప్పారా మీరు” అని రీతూ చౌదరి అడిగింది. “హౌజ్ క్లీనింగ్ అన్నప్పుడు అటోమేటిక్‌గా కిచెన్ టేబుల్ కూడా వస్తుందిగా” అని మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ చెప్పాడు.
మాస్క్ మ్యాన్ ఆగ్రహం
“మా కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు. కేవలం వంట మాత్రమే చేస్తారు” అని కామనర్ ప్రియా శెట్టి అంది. “నాకు ఏమనిపిస్తుందంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. కొంతమంది తినేసి ఖాళీగా కూర్చుంటున్నారు కదా” అని హరీష్ అన్నాడు. దానికి “అది కరెక్ట్ కాదు” అని మర్యాద మనీష్ అన్నాడు.
“మనీష్ మీకు బ్యాడ్జ్ రాలా. మీరు మాట్లాడకండి. ఏమైనా వస్తే నామీద తీసుకుంటా. నేను ఇంట్లోంచి వెళ్లిపోడానికి కూడా రెడీ నేను తీసుకుంటా కాల్ (బాధ్యత)” అని మాస్క్ మ్యాన్ గొడవ పెట్టుకున్నాడు. ఇలా మొదటి రోజే హౌజ్‌లో టాస్క్ విషయంగా రచ్చ జరిగింది.
బిగ్ బాస్ తెలుగు 9 మొదటి రోజు నుంచే ఉద్రేకాలు, గొడవలు ప్రారంభమయ్యాయి. మాస్క్ మ్యాన్ ఆగ్రహం, ఇతర కంటెస్టెంట్లతో తలెత్తిన వివాదాలు ఈ సీజన్‌లో ఎంత ఉత్కంఠ ఉంటుందో తెలియజేస్తున్నాయి.


